Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: పూనకాలు, అరుపులు, తిట్లు.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్ మాటలు..

Sajjala Ramakrishna Reddy: పూనకాలు, అరుపులు, తిట్లు.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్ మాటలు..

Shaik Madar Saheb

|

Updated on: Aug 14, 2023 | 2:11 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌కళ్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్ప పవన్‌ ప్రసంగంలో ఏమి లేదన్నారు. పవన్‌కళ్యాణ్‌ కంటే స్వచ్ఛంద సంస్థలు నయమంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు.

అమరావతి, ఆగస్టు 14: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌కళ్యాణ్‌పై మండిపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే పవన్‌ కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. పూనకాలు, అరుపులు, తిట్లు తప్ప పవన్‌ ప్రసంగంలో ఏమి లేదన్నారు. పవన్‌కళ్యాణ్‌ కంటే స్వచ్ఛంద సంస్థలు నయమంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. ప్రభుత్వంపై విపక్షాల తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని.. ఓ పద్దతి ప్రకారం బురద జల్లుతున్నారంటూ ఫైర్ అయ్యారు. జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని.. బాబు డైరెక్షన్‌లో పవన్‌ మాట్లాడుతున్నారంటూ సజ్జల పేర్కొన్నారు. వారాహి విజయయాత్ర మూడో విడత మూడో రోజు గాజువాకలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో అమరావతిలో వైసీపీ కార్యాలయంలో మీడియాతో మట్లాడిన సజ్జల రామకృష్ణా రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ తీరుపై మండిపడ్డారు. విపక్ష పార్టీలు అరాచక శక్తులగా ప్రవర్తిస్తున్నాయంటూ సజ్జల విమర్శించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..