Telangana Congress: తిరగబడదాం, తరిమికొడదాం.. తెలంగాణలో స్పీడు పెంచుతున్న కాంగ్రెస్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ వేగం పెంచింది. తిరగబడదాం, తరిమికొడదాం అంటూ సరికొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై..
హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ వేగం పెంచింది. తిరగబడదాం, తరిమికొడదాం అంటూ సరికొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా కోర్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అంశాల వారీగా ప్రచారం చేసేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రచారంలో ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. తెలంగాణలోనూ కర్నాటక తరహా వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఇవాళ జరిగే స్క్రీనింగ్ కమిటీ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఇవాళ గాంధీ భవన్‌లో జరిగే పీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు సీనియర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. ఈ మేరకు మురళీధరన్ హైదరాబాద్ చేరుకోగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్, ఉత్తమ్ ఆయనకు స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల రోడ్ మ్యాప్, కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..