WTC 2023 Final: ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చిన సౌతాఫ్రికా.. దెబ్బకు మారిన టీమిండియా లక్.. ఎందుకో తెలుసా?

రోహిత్ శర్మ సేన 58.93 శాతం పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక 53.33 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో భారత్‌కు..

WTC 2023 Final: ఆస్ట్రేలియాకు బిగ్ షాకిచ్చిన సౌతాఫ్రికా.. దెబ్బకు మారిన టీమిండియా లక్.. ఎందుకో తెలుసా?
Wtc Final Race India
Follow us

|

Updated on: Jan 08, 2023 | 3:44 PM

ఆదివారం సిడ్నీలో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడవ, చివరి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోణం నుంచి చూస్తే.. భారత్, శ్రీలంక టీంలకు బాగా కలసివచ్చింది. సిడ్నీలో ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకుని, సౌతాఫ్రికా టీం బ్యాటర్లు ఎంతో పోరాటాన్ని ప్రదర్శించారు. వర్షం-ప్రభావిత మ్యాచ్‌లో ఫలితం డ్రాగా ముగిసిపోవడంతో ఆసీస్ జట్టుకు ఎలాంటి ఉపయోగం లేకపోయింది. అయితే, దీని అర్థం ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి భారత్‌తో జరగబోయే సిరీస్ వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత డ్రా మ్యాచ్‌తో ఆస్ట్రేలియా టీం తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది.

ఆస్ట్రేలియా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫైనల్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. సిడ్నీలో జరిగిన డ్రా కారణంగా పాట్ కమ్మిన్స్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన జట్టుగా, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయింది. ఆస్ట్రేలియా సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. అయితే బ్యాట్‌తో మరో ఆధిపత్య ప్రదర్శనను చేసినా.. టెస్టును డ్రా చేసుకోవడంతో ఆస్ట్రేలియా జట్టు పాయింట్-శాతం 75.56 కి పడిపోయింది.

రోహిత్ శర్మ సేన 58.93 శాతం పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, శ్రీలంక టీం 53.33 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. కాగా, భారత్‌కు వరుసగా రెండో ఫైనల్‌కు చేరే అవకాశాలు మరింతగా పెరిగాయి.

ఇవి కూడా చదవండి

Wtc Points Table

ఆస్ట్రేలియా మాదిరిగానే, దక్షిణాఫ్రికా కూడా ఎంతో విలువైన పాయింట్లను కోల్పోయింది. ప్రోటీస్ టీం 48.72 శాతంతో నాల్గవ స్థానంలో మిగిలిపోయింది. వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగబోయే సిరీస్‌లో తల రాతను మార్చుకోవాలని ఎదురుచూస్తోంది.

కానీ, దక్షిణాఫ్రికా అవకాశాలు ఇతర జట్లపై కూడా ఆధారపడి ఉంటాయి. కరేబియన్ జట్టుపై రెండు టెస్టుల్లోనూ విజయాలు తప్పక చేయాల్సిందే. ఆస్ట్రేలియాలో నిరాశాజనక పర్యటన తర్వాత డీన్ ఎల్గర్ జట్టుకు ఇతర జట్ల ఫలితాలు మాత్రమే ఆశాజనకంగా ఉంటాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..