AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లైటర్ త్వరగా పంపండ్రోయ్.. లైవ్ మ్యాచ్‌లో సిగ్నలిచ్చిన స్టార్ ప్లేయర్.. చివరకు ఏం జరిగిందంటే..

Marnus Labuschagne: మార్నస్ లాబుషెన్ ఇలాంటి సిగ్నల్స్ చూసి వ్యాఖ్యాతలు నవ్వడం ప్రారంభించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి లైటర్ తీసుకురాగానే, మార్నస్ లాబుషెన్ తన..

Video: లైటర్ త్వరగా పంపండ్రోయ్.. లైవ్ మ్యాచ్‌లో సిగ్నలిచ్చిన స్టార్ ప్లేయర్.. చివరకు ఏం జరిగిందంటే..
Marnus Labuschagne Viral Vi
Venkata Chari
|

Updated on: Jan 05, 2023 | 3:41 PM

Share

Watch Video: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ ఆడుతోంది. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఓ సంఘటన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న వెటరన్ బ్యాట్స్‌మెన్ మార్నస్ లాబుస్‌చాగ్నే షాకింగ్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా బిత్తరపోయారు. తొలుత ఎవరికీ ఏం అర్ధం కాలేదు. కానీ, ఆ తర్వాగ జరిగిన సీన్ చూసి, అంతా షాక్ అయ్యారు. ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ పొగతాగుతున్నట్లు చేతులు చూపిస్తూ.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి లైటర్ అడిగాడు.

బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో మార్నస్ లాబుషెన్ హెల్మెట్‌లో సమస్య వచ్చింది. దాన్ని సరిచేయడానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి లైటర్ తీసుకురావాలని సూచించాడు. మార్నస్ లాబుస్చాగ్నే సిగరెట్ తాగుతూ సైగ చేశాడు. లైటర్ కోసం సిగిరెట్ తాగుతున్నట్లు సంజ్ఞలు చేశాడు. చాలా సేపు డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ఆటగాళ్లకు మార్నస్ లబుషెన్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు.

ఇవి కూడా చదవండి

లైటర్‌ కోసం సిగ్నల్స్..

మార్నస్ లాబుషెన్ ఇలాంటి సిగ్నల్స్ చూసి వ్యాఖ్యాతలు నవ్వడం ప్రారంభించారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి లైటర్ తీసుకురాగానే, మార్నస్ లాబుషెన్ తన హెల్మెట్‌ని సరిచేయడం ప్రారంభించాడు. లైటర్ వెలిగించి హెల్మెట్ లోపలి భాగంలో రిపేర్లు చేసుకున్నాడు. హెల్మెట్ ఫిక్స్ చేసిన తర్వాత మార్నస్ లబుషెన్ మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ పేజీలో ఈ పూర్తి వీడియోను షేర్ చేసింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు తొలి టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. చివరిదైన మూడో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటి వరకు జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..