World Cup 2023: టార్గెట్ 2023.. 20 మంది ఆటగాళ్లను సిద్ధం చేసిన బీసీసీఐ.. 10 ఏళ్ల నిరీక్షణకు ఇకనైనా తెరపడేనా?
Team India: భారత జట్టు వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లలో టైటిల్‌కు చేరువైనా.. ఘోర పరాజయంతో దక్కించుకోలేకపోయింది. ఇది టీమిండియా, బీసీసీఐని ప్రశ్నార్థకంగా మార్చింది.
Indian Cricket Team: పదేళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ టోర్నీ టైటిల్ కరువుకు తెరపడేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చాలా సీరియస్‌గా ప్లాన్ చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ప్రపంచ కప్‌లు (ODI, T20) మిస్ కావడం వల్ల భారత క్రికెట్ జట్టు, బీసీసీఐ నిరంతరం విమర్శలకు గురవుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం ప్రపంచ కప్‌ను ఒడిసి పట్టేందుకు భారత బోర్డు పక్కాగా ప్లాన్ చేస్తోంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఓ ప్రత్యేక నిర్ణయం ఆటగాళ్లతో కూడిన మెయిన్ టీం. ఇందుకోసం 20 మంది ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్ తయారు చేసింది.
కొత్త సంవత్సరం తొలి రోజైన జనవరి 1 ఆదివారం నాడు, భారత బోర్డు టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ సమావేశంలో బోర్డు తరపున చైర్మన్ రోజర్ బిన్నీ (వీడియో కాన్ఫరెన్సింగ్), సెక్రటరీ జై షా పాల్గొన్నారు. ఈ సమావేశంలో 2022లో టీమిండియా ప్రదర్శన, ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ వైఫల్యం, 2023 ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌పై చర్చించారు.
ఈ సమావేశంలో బీసీసీఐ అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో టీమ్ ఇండియాలో కొత్త ఆటగాళ్ల ఎంపిక, వారి ఫిట్‌నెస్, పనిభార నిర్వహణపై దృష్టి సారించింది. దీనితో పాటు ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రధాన ఆటగాళ్ల సమూహాన్ని కూడా సిద్ధం చేసింది. సమావేశం అనంతరం బోర్డు సెక్రటరీ జై షా మీడియాతో మాట్లాడుతూ.. ‘బీసీసీఐ 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసిందని, వారిని ప్రపంచకప్ వరకు తీర్చిదిద్దడమే లక్ష్యం అంటూ’ చెప్పుకొచ్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..