IND vs SL: దేశవాళీలో దుమ్మురేపాడు.. ఆపై ఐపీఎల్‌లో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే.. శాంసన్ స్థానంలో లక్కీ ఛాన్స్ కొట్టేశాడుగా..
Jitesh Sharma: వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ దేశవాళీ క్రికెట్‌లో విదర్భ తరపున ఆడుతున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
Jitesh Sharma: భారత్ -శ్రీలంక మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో (IND vs SL) రెండో మ్యాచ్‌కు ముందు సంజూ శాంసన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మకు టీమ్ ఇండియాలో చోటు కల్పించారు. జితేష్ శర్మకు జాతీయ జట్టు నుంచి పిలుపు రావడం ఇదే తొలిసారి. రిషబ్ పంత్ కారు ప్రమాదం, కేఎల్ రాహుల్ గైర్హాజరు కావడం జితేష్‌కు ఈ సువర్ణావకాశాన్ని అందించింది. ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది మాత్రం నేడు టాస్ తర్వాత తెలియనుంది. అయితే భారత ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అతనికి ఎంతో ఆనందంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
2012-13 కూచ్ బెహార్ ట్రోఫీ కోసం విదర్భ సీనియర్ జట్టులో జితేష్‌ను మొదట చేర్చారు. ఇక్కడ 12 ఇన్నింగ్స్‌ల్లో 537 పరుగులు చేశాడు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత జితేష్ మెల్లగా విజయాల బాట పట్టాడు. మార్చి 2014లో, అతను విజయ్ హజారే ట్రోఫీలో లిస్ట్-ఏ అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. ఆ తర్వాత, 2015-16లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 2016 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని కొనుగోలు చేసింది.
ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం జితేష్‌కు లభించలేదు. అతను ముందు చాలా సీజన్లలో తన IPL అరంగేట్రం చేయలేకపోయాడు. కానీ, అతను అన్ని దేశీయ టోర్నమెంట్లలో విదర్భ కోసం పరుగులు చేయడం కొనసాగించాడు. 2022లో పంజాబ్ కింగ్స్ అతడిని కొనుగోలు చేసి ప్లేయింగ్-11లో చేర్చింది. గత సీజన్‌లో ఈ ఆటగాడు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఐపీఎల్ 2022లో అదరగొట్టిన జితేష్..
జితేష్ ఐపీఎల్ 2022లో పంజాబ్ కింగ్స్ తరపున 14 మ్యాచ్‌లలో 12 ఆడాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ 29.25 సగటుతో పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 163.64గా నిలిచింది. 22 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అతను ఏ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. కానీ, అతని వేగవంతమైన ఇన్నింగ్స్ చాలా ప్రభావవంతంగా నిలిచింది. దీనితో పాటు, అతను రెండు స్టంపింగ్‌లతో సహా వికెట్ వెనుక 11 మందిని పెవిలియన్ చేర్చాడు.
జితేష్ శర్మ అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో పాటు మొదటి బంతి నుంచే వేగంగా బ్యాటింగ్ చేయగలడు. అతను టాప్ ఆర్డర్‌లో కూడా ఆడగలడు. ఫినిషర్ పాత్రను కూడా పోషించగలడు. అటువంటి పరిస్థితిలో, సంజూ శాంసన్ స్థానంలో టీ20 జట్టులో అతని కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..