Suryakumar Yadav: ఓవైపు ఏబీడీ క్లాస్.. మరోవైపు గేల్ మాస్.. మిక్సింగ్ చేస్తే సూర్య.. మిస్టరీ బ్యాటింగ్ చూస్తే ఫిదానే: పాక్ మాజీ ప్లేయర్స్
ప్రస్తుతం ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది టీ20 క్రికెట్‌లో 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసే విధానం కారణంగా, అతను ఎప్పుడూ ప్రొటీస్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌తో పోల్చుతుంటారు. ఇద్దరి ఆట తీరు దాదాపు ఒకేలా ఉంటుంది. ఏబీ డివిలియర్స్‌కు గ్రౌండ్ అంతా షాట్లు కొట్టే సామర్థ్యం ఎలా ఉందో, సూర్యకుమార్ యాదవ్‌కు కూడా అదే సామర్థ్యం ఉంది. ఇంతకుముందు డివిలియర్స్‌ని మిస్టర్ 360 డిగ్రీ అని పిలవడానికి అదే కారణం. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్‌ను ఈ పేరుతో పిలవడానికి కూడా ఇదే కారణంగా నిలిచింది.
సూర్యకుమార్ యాదవ్ లేదా ఏబీ డివిలియర్స్‌లో ఉత్తమం ఎవరు? క్రికెట్ నిపుణులు, మాజీ క్రికెటర్లలో కూడా దీని గురించి తరచుగా చర్చిస్తారు. తాజాగా ఈ చర్చపై షోయబ్ అక్తర్ మాట్లాడాడు. సూర్య, డివిలియర్స్‌లో ఎవరు ఎక్కువ ఇష్టపడతారు అని అడిగినప్పుడు, భారత బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా సమాధానం ఇచ్చాడు.
షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, ‘నేను ఏబీ డివిలియర్స్‌కు బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ను ఎన్నుకుంటాను. ఏబీకి క్లాస్ ఉంది. సూర్యకుమార్ యాదవ్ నిర్భయంగా షాట్లు ఆడేస్తుంటాడు. నేను ఖచ్చితంగా ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ కోసం 100 మార్కులు ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. సూర్య మాస్ బ్యాటింగ్‌తో దంచికొట్టేస్తాడు. గేల్ కంటే కూడా బీభత్సమైన షాట్లు ఆడేస్తాడు. వీరిద్దరిని మించిపోతున్నాడు. సూర్య బ్యాటింగ్ చూస్తే, ఈ ఇద్దరు దిగ్గజాలు కూడా సలాం చేస్తారు అంటూ మరో పాక్ మాజీ ప్లేయర్ సూర్యపై ప్రశంసల జల్లు కురిపించారు.
టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్..
ప్రస్తుతం ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది టీ20 క్రికెట్‌లో 1000కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు సూర్యకుమార్ 45 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 180.34 స్ట్రైక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. శనివారం శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో సూర్య 51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని టీ20 అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..