Video: బౌండరీ లైన్‌లో మెరుపు ఫీల్డింగ్.. చిరుత కన్నా వేగంగా.. గాల్లోకి ఎగిరిన ప్లేయర్.. వీడియో చూస్తే షాకే..
Big Bash League: బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ బెన్ కట్టింగ్ బౌండరీ వద్ద సూపర్ మ్యాన్ కన్నా వేగంగా కదులుతూ క్యాచ్ పట్టాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
Viral Video: ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ బెన్ కట్టింగ్ తన బ్యాటింగ్, బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. అదే ఊపుతో బిగ్ బాష్ లీగ్ (BBL)లో సందడి చేస్తు్న్నాడు. ప్రస్తుతం అతను బీబీఎల్‌లో సిడ్నీ థండర్ తరపున ఆడుతున్నాడు. ఆదివారం సిడ్నీ థండర్‌తో సిడ్నీ సిక్సర్స్‌తో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కటింగ్ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
ఇంతటి అద్భుతమైన ఫీల్డింగ్ చేసినా.. కట్టింగ్ తన జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ ఎనిమిది వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ జట్టు 16.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సాధించింది.
బౌండరీ లైన్‌లో సూపర్ మ్యాన్ ఫీల్డింగ్..
ఈ మ్యాచ్‌లో కట్టింగ్ ఓ సూపర్ క్యాచ్ పట్టడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. స్టాండ్‌లో కూర్చున్న వారంతా తమ సీట్లలో నుంచి షాకవుతూ అలానే చూస్తుండిపోయారు. వీరితో పాటు బ్యాట్స్‌మెన్, బౌలర్, ఫీల్డర్‌లు కూడా ఈ క్యాచ్‌ని నమ్మలేకపోయారు. సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్ కొనసాగుతోంది. బౌలర్ బ్రెండన్ డాగెట్ కగా, బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ సిద్ధంగా ఉన్నారు. బౌలర్ ఆఫ్ స్టంప్ బయట వేసిన రెండో బంతిని విన్స్ ఆడాడు. బంతి బ్యాట్‌కి తగిలి థర్డ్ మ్యాన్‌కి వెళ్లింది. కట్టింగ్ అక్కడే నిలబడి ఉన్నాడు. బంతి కాస్త దూరంగా, చాలా ఎత్తులో వెళ్తుంటే.. సూపర్ మ్యాన్‌లా వేటాడు.
కట్టింగ్ కీలక సమయంలో సూపర్ మ్యాన్ కన్నా వేగంగా జంప్ చేసి, రెండు చేతులు తెరిచి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసిన జనాలంతా నోరెళ్లబెట్టారు.
మ్యాచ్ విషయానికి వస్తే..
Ben Cutting with a HUGE specky on the boundary line! ?#BBL12 | @Toyota_Aus | #ohwhatafeeling pic.twitter.com/77hfwUTmCD
— cricket.com.au (@cricketcomau) January 8, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ జట్టు పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఆ ఆ జట్టులో శామ్ వైట్‌మన్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు. 34 బంతుల్లో 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆయన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. అలెక్స్ రాస్ 34 పరుగులు చేశాడు. కట్టింగ్ 15 బంతుల్లో ఐదు ఫోర్లతో అజేయంగా 26 పరుగులు చేశాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టాడు.
కెప్టెన్ మోయిసెస్ హెన్రిక్స్, జోర్డాన్ సిల్క్ అర్ధ సెంచరీల ఆధారంగా సిడ్నీ సిక్సర్స్ విజయం సాధించింది. హెన్రిక్స్ 38 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో అజేయంగా 53 పరుగులు చేశాడు. జోర్డాన్ 42 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో అజేయంగా 59 పరుగులు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..