Watch Video: హౌసింగ్ సొసైటీలో పార్కింగ్‌ కోసం గొడవ పడ్డ స్థానికులు.. వైరలవుతున్న వీడియో

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారణమైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ అనే హైసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగడం చర్చనీయాంశమైంది. ఒకరిపై మరొకరు తమ చేతికి దొరికిన వస్తవులతో ఘర్షణలకు దిగడం ఆందోళ కలిగించింది. హౌసింగ్ సొసైటీలోని పార్కింగ్ వద్ద మొదటగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరో వ్యక్తి ఈ గోడవకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Watch Video: హౌసింగ్ సొసైటీలో పార్కింగ్‌ కోసం గొడవ పడ్డ స్థానికులు.. వైరలవుతున్న వీడియో
Fight
Follow us
Aravind B

|

Updated on: Aug 15, 2023 | 5:29 AM

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దారణమైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫ్లోరా హెరిటేజ్ అనే హైసింగ్ సొసైటీ వద్ద స్థానికులు గొడవకు దిగడం చర్చనీయాంశమైంది. ఒకరిపై మరొకరు తమ చేతికి దొరికిన వస్తవులతో ఘర్షణలకు దిగడం ఆందోళ కలిగించింది. హౌసింగ్ సొసైటీలోని పార్కింగ్ వద్ద మొదటగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మాటామాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ విషయాన్ని స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరో వ్యక్తి ఈ గోడవకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్నాక ఆ గొడవను ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ గోడవ ఆగలేదు. చివరకు పోలీసులపై కూడా నిందితులు దాడులకు పాల్పడ్డారు. చొరవ తీసుకున్నటువంటి పోలీసులపై కూడా దాడి జరగడంతో అక్కడున్న వారు ఆశ్యర్యపోయారు.

ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే ఘర్షణకు పాల్పడినటువంటి నిందితులను పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు నిందితులు నిరాకరించారు. పోలీసులు హౌసింగ్ సోసైటీలోకి రాకుండా కూడా నిందితులు అడ్డుకున్నారు. అలాగే మరికొంత మంది స్థానికులు కూడా పోలీసుల పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే పోలీసులు కూడా తమపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే తమ మహిళల మొబైల్ ఫోన్లను కూడా లాక్కేళ్లారని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆరంభంలో ఇలాంటి ఘటనే నోయిడాలో జరిగింది. పార్కింగ్ విషయంలో వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. అప్పట్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో దారుణాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. రెండు వర్గాల మధ్య గొడవలు జరగడం, మూక దాడులు వంటివి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పోలీసులు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకుంటున్నా కూడా ఇవి ఆగడం లేదు. మరోవిషయం ఏంటంటే కొన్ని గొడవలు మరీ ఎక్కువై హత్యలు తీసుకునేవరకు కూడా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటీజన్ల విభిన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో