AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కోడి పిల్లలకు తల్లిగా మారిన పిల్లి.. అప్పుడే వచ్చిన తల్లి కోడి ఏం చేసిందంటే.. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి

నేనే నీ తల్లిని అన్నట్టుగా వాటినే చూస్తూ తల్లి లాంటి వెచ్చదనాన్ని ఆ కోడి పిల్లలకు అందిస్తుంది. ఆ పిల్లలు కూడా కొత్త తల్లికి చాలా సులభంగా అలవాటు పడతాయి. అప్పటికి అక్కడికి చేరుకున్న తల్లి కోడి ఈ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురవుతుంది. తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అన్నట్టుగా ఆ తల్లి నివ్వెర పోయి చూస్తుంది. ఇదిలా ఉండగానే.. ఆ కోడిపిల్లలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వచ్చి తల్లి కోడికి చెబుతున్నాయి.. ఆ వెంటనే తల్లి కోడి ఏం చేసిందంటే...

Watch Video: కోడి పిల్లలకు తల్లిగా మారిన పిల్లి.. అప్పుడే వచ్చిన తల్లి కోడి ఏం చేసిందంటే.. వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
Cat Adopt Chickens
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2023 | 7:36 PM

Share

మనుషుల మధ్య స్నేహం సర్వసాధారణం. అయితే, కొన్ని భిన్న జాతి జంతువులు కూడా స్నేహం చేయటం మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాగే బద్ధశత్రువులైన జంతువులు కూడా చెట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా చూశాం. కుక్కతో పిల్లి, కోతితో కుక్క, పందికి పాలిచ్చే కుక్కలు.. ఇలా ఎన్నో చిత్ర విచిత్ర స్నేహాలకు సంబంధించిన అనేక రకాల వీడియోలు, వార్తలు మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. అలాంటిదే ఈ వీడియో కూడా. ప్రస్తుతం ఓ పిల్లల కోడి, పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ పిల్లి విచిత్రంగా కోడి పిల్లలను అక్కున చేర్చుకుని సాకుతుంది. పిల్లి చూపుతున్న ప్రేమకు ఆ కోడిపిల్లలు తల్లిని కూడా మర్చిపోయాయంటే నమ్మండి.

సోషల్ మీడియాలో తల్లి కోడిని పక్కన పెట్టి ఆ పిల్లలు పిల్లికి దగ్గరైన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ పిల్లి ఆ కోడి పిల్లలను ఒక్కొక్కటిగా మింగితే దానికి అది మంచి విందు భోజనం అవుతుంది. కానీ అలా కాకుండా చిన్న కోళ్లను వెచ్చగా చూసుకుంటుంది ఆ పిల్లి. నేనే నీ తల్లిని అన్నట్టుగా వాటినే చూస్తూ తల్లి లాంటి వెచ్చదనాన్ని ఆ కోడి పిల్లలకు అందిస్తుంది. ఆ పిల్లలు కూడా కొత్త తల్లికి చాలా సులభంగా అలవాటు పడతాయి. అప్పటికి అక్కడికి చేరుకున్న తల్లి కోడి ఈ దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురవుతుంది. తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అన్నట్టుగా ఆ తల్లి నివ్వెర పోయి చూస్తుంది. ఇదిలా ఉండగానే.. ఆ కోడిపిల్లలు మాత్రం ఒక్కొక్కటిగా బయటకు వచ్చి తల్లి కోడికి చెబుతున్నాయి.. మాకు కొత్త తల్లి వచ్చిందని.. అచ్చం అక్కడి సీన్‌ ఇలాగే ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

@cats_of_day ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో షేర్ చేయబడింది. తల్లి కోడి నిజంగా భయాందోళన, షాక్, గందరగోళంతో షాక్‌ తిన్నట్టుగా నిలబడిపోయింది. సరిగ్గా కళ్లు కూడా తెరవని కోడి పిల్లను దగ్గర తీసుకున్న పిల్లిని చూసిన క్షణంలో ఆ తల్లి కోడి అనుభవించిన భయం ఎలా ఉందో ఈ వీడియో చూడండి. తల్లి కోడి పరిస్థితిని చూసి పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదని, ఆ కోడి కొత్త బాలింతను పెట్టుకుందని కొందరు చమత్కరించారు.

ఓ పిల్లి తను తల్లి కావాలని భావించి ఈ పిల్లలను దత్తత తీసుకుంది. దత్తత ప్రక్రియ ఎంత సులభమో చూడండి! అంటూ మరోకరు వ్యాఖ్యానించారు. బేబీ సిట్టర్ చాలా ముద్దుగా ఉంటాడని, తల్లి కంటే మెత్తగా ఉంటాడని పిల్లలు అనుకుంటూ వెచ్చగా కూర్చున్నాయని మరొకరు చెప్పారు. ఈ వీడియోకు బ్యాగ్‌ గ్రౌండ్‌లో మంచి మ్యూజిక్‌ పెట్టాల్సింది అంటూ మరి కొందరు అడిగారు.

మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఫర్వాలేదు.. నా పిల్లలు నాకు తిరిగి ఇవ్వరు అన్నట్టుగా ఆ తల్లి కోడి ప్రదేయపడుతుందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి అందమైన వీడియోల కోసం ఉపయోగించే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్, మ్యూజిక్ గురించి చాలా మంది వివాదాన్ని లేవనెత్తారు. అది ఆ వీడియోలోని సున్నితత్వాన్ని కోల్పోతుందని అన్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి