AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : భారీ వర్షాలతో మధ్యలో కొట్టుకుపోయిన రోడ్డు.. వేగంగా వచ్చి గుంతలో దిగబడ్డ కారు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..

భారీ వర్షానికి రోడ్డు మధ్య భాగం కొట్టుకుపోయిందని తెలియక వేగంగా వెళ్తున్న ఓ కారు గుంతలో పడింది. ఈ ఘటన వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో వేగంగా వెళ్తున్న కారు కనిపిస్తుంది.. ఈ దృశ్యం వెనుక నుంచి వస్తున్న వాహనం డాష్‌క్యామ్‌లో రికార్డైంది. అలా వేగంగా వెళ్తున్న కారు ఒక దశలో మార్గమధ్యలో పడి ఉన్న గుంతలో కూరుకుపోయింది. భారీ వర్షాలకు బ్రిడ్జిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో మార్గమధ్యలో భారీ గుంత ఏర్పడింది. తనకు తెలియకుండానే వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నేరుగా లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం ఒక్కక్షణం గుండె పగిలేలా చేస్తుంది.

Viral Video : భారీ వర్షాలతో మధ్యలో కొట్టుకుపోయిన రోడ్డు.. వేగంగా వచ్చి గుంతలో దిగబడ్డ కారు.. షాకింగ్‌ వీడియో వైరల్‌..
Car Plunges Into Massive Cr
Jyothi Gadda
|

Updated on: Aug 15, 2023 | 9:45 PM

Share

ప్రమాదాల భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో కొత్తేమీ కాదు. అయితే ఇలాంటి సన్నివేశాలు సహజంగానే మనల్ని షాక్‌కి గురిచేస్తాయి. ఇది కూడా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చైనాలో చిత్రీకరించినట్టుగా తెలిసింది. భారీ వర్షాలతో చైనా వణికిపోయింది. చాలా చోట్ల రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. ఇది అనేక ప్రమాదాలకు దారి తీసింది.. అందుకు నిదర్శనమే ఈ దృశ్యం. వర్షం సమయంలో సృష్టించిన ఓ భయంకరమైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఏర్పడ్డ భారీ గుంతలో పడిపోయిన ఈ ప్రమాద దృశ్యం ఒక్కసారిగా అందరినీ కలిచివేసింది. ఒక్క క్షణం గుండె పగిలిపోయేలా చేసే సీన్ ఇది…! ఈ భయానక దృశ్యం.. కారు నేరుగా కాలువలో పడిన క్షణం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.

భారీ వర్షానికి రోడ్డు మధ్య భాగం కొట్టుకుపోయిందని తెలియక వేగంగా వెళ్తున్న ఓ కారు గుంతలో పడింది. ఈ ఘటన హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వీడియోలో వేగంగా వెళ్తున్న కారు కనిపిస్తుంది.. ఈ దృశ్యం వెనుక నుంచి వస్తున్న వాహనం డాష్‌క్యామ్‌లో రికార్డైంది. అలా వేగంగా వెళ్తున్న కారు ఒక దశలో మార్గమధ్యలో పడి ఉన్న గుంతలో కూరుకుపోయింది. భారీ వర్షాలకు బ్రిడ్జిలో కొంత భాగం కొట్టుకుపోవడంతో మార్గమధ్యలో భారీ గుంత ఏర్పడింది. తనకు తెలియకుండానే వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ నేరుగా లోయలో పడిపోయాడు. ఈ దృశ్యం ఒక్కక్షణం గుండె పగిలేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత ఏమైంది…? డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది అన్నది స్పష్టం తెలియలేదు. అయితే తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రక్షించబడినట్టుగా తెలిసింది. ఆగస్ట్ 3న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. చైనాలో వర్షం చాలా బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా చాలా మంది తమ ఆస్తులను కోల్పోయారు. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది.

భారీ వర్షాలు, వరదలతో చైనా అతలాకుతలమవుతుంది. చైనా రాజధానిలో 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైనట్టుగా తెలిసింది. చైనాలో వర్షాలు సృష్టించిన భయానక దృశ్యాలు అనేకం సోషల్ మీడియాలో కనిపించాయి.

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్ చేయండి