Conjunctivitis: కండ్ల కలకలు వస్తే ఈ ఆహారాలు తినవద్దు.. ఇన్ఫెక్షన్‌ మరింత పెరిగే అవకాశం..!

మీరు మీ చేతులతో తాకిన ప్రతిదానిని శానిటైజ్ చేయండి. ఉదాహరణకు, రోజువారీ ఉపయోగం మొబైల్, రిమోట్‌ వంటివి వెంటనే క్లీన్‌ చేయాలి. ఇతరులు టీవీ రిమోట్‌ను ఉపయోగించినప్పుడు, రిమోట్‌కు అంటుకున్న బ్యాక్టీరియా మీ ద్వారా వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీకు కంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు వాడే తువ్వాళ్లు, పిల్లో కవర్లను వేడి నీటితో కడగాలి. ఇతరులు ఎవరూ వాటిని ఉపయోగించకుండా చూసుకోండి. బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి. ఇది మీ కళ్ళకు చాలా మంచిది. క్యారెట్, బత్తాయి, గుమ్మడి, మామిడి, నేరేడు, బచ్చలికూర వంటి ఆహారాలను ఎక్కువగా తినండి.

Conjunctivitis: కండ్ల కలకలు వస్తే ఈ ఆహారాలు తినవద్దు.. ఇన్ఫెక్షన్‌ మరింత పెరిగే అవకాశం..!
Pink Eyes
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 15, 2023 | 8:50 PM

కంటి నొప్పి, ఐ ఇన్ఫెక్షన్‌.. అనేది ఒక వ్యక్తి నుండి మరోకరికి వ్యాపించే ఇన్ఫెక్షన్. దీనిని నివారించడానికి సోకిన వారు తమ పరిసరాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల కంటి ఇన్ఫెక్షన్‌ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సందర్భంలో కంటికి వీలైనంత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కంటి ఇన్ఫెక్షన్‌ని త్వరగా నయం చేయడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే.. కంటి నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కంటిలో నొప్పి ఉన్నప్పుడు, కంటి నుండి తరచుగా నీరు కారుతుంది. ఇది సాధారణంగా చేతితో తుడిచివేస్తుంటారు. కానీ, కళ్లను తరచుగా తాకడం వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా కంటికి చేరి ఇన్ఫెక్షన్ మరింతగా పెరుగుతుంది. కాబట్టి కాటన్ లేదా శుభ్రమైన గుడ్డతో కళ్లను తుడుచుకోవడం మంచిది.

మీకు కంటి ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవడం వంటిది చేయరాదు. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల కంటిలోని బ్యాక్టీరియా లెన్స్‌కు అంటుకుంటుంది. మీరు దీన్ని మళ్లీ ఉపయోగించినప్పుడు ఇది మీ కళ్ళలోకి తిరిగి రావచ్చు. కంటి ఇన్ఫెక్షన్‌ అలా మరోమారు ఎటాక్‌ చేస్తుంది. కంటి ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు కళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన గుడ్డ తీసుకుని చల్లటి నీళ్లలో ముంచి కళ్లు మూసుకుని కళ్లపై పెట్టుకోవాలి. కళ్ల చుట్టూ కూడా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.

మీరు మీ చేతులతో తాకిన ప్రతిదానిని శానిటైజ్ చేయండి. ఉదాహరణకు, రోజువారీ ఉపయోగం మొబైల్, రిమోట్‌ వంటివి వెంటనే క్లీన్‌ చేయాలి. ఇతరులు టీవీ రిమోట్‌ను ఉపయోగించినప్పుడు, రిమోట్‌కు అంటుకున్న బ్యాక్టీరియా మీ ద్వారా వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీకు కంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు వాడే తువ్వాళ్లు, పిల్లో కవర్లను వేడి నీటితో కడగాలి. ఇతరులు ఎవరూ వాటిని ఉపయోగించకుండా చూసుకోండి.

ఇవి కూడా చదవండి

బీటా కెరోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినండి. ఇది మీ కళ్ళకు చాలా మంచిది. క్యారెట్, బత్తాయి, గుమ్మడి, మామిడి, నేరేడు, బచ్చలికూర వంటి ఆహారాలను ఎక్కువగా తినండి. అలాగే, ఐ ఇన్ఫెక్షన్‌ తో బాధపడుతున్నప్పుడు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఆరెంజ్, పియర్, కివీ ఫ్రూట్, లెమన్ వంటి పండ్లను ఎక్కువగా తినండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా త్వరగా కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..