Chandrayaan 3 Updates: మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన ఇస్రో.. జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్‌-3..

అంతా సవ్యంగా సాగితే మరో వారం రోజుల్లో చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. రేపు స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోతుందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ల్యాండర్‌ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దించనున్నారు. అయితే చంద్రయాన్‌-2 సందర్భంగా ల్యాండింగ్‌ దగ్గరే ప్రయోగం విఫలమైంది. ఆగస్టు 23న లేదంటే 24న ల్యాండర్‌ చందమామపై దిగే..

Chandrayaan 3 Updates: మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసిన ఇస్రో.. జాబిల్లికి మరింత చేరువైన చంద్రయాన్‌-3..
Chandrayaan 3
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2023 | 1:20 PM

Chandrayaan 3 Updates: చంద్రుడిపై అధ్యయనానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది…కక్ష్య తగ్గింపు ప్రక్రియను శాస్త్రవేత్తలు ఉదయం 8.30 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు..దాంతో ప్రస్తుతం చంద్రుడి చుట్టూ ఉన్న 153 X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి స్పేస్‌క్రాఫ్ట్‌ తిరుగుతోంది. దీంతో చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్ 3 చేరుకుంటుంది.

అంతా సవ్యంగా సాగితే మరో వారం రోజుల్లో చంద్రయాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్ విజయవంతంగా చుంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. రేపు స్పేస్‌క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోతుందని ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ల్యాండర్‌ మాడ్యూల్‌ వేగాన్ని తగ్గిస్తూ చంద్రుడి ఉపరితలంపై దించనున్నారు. అయితే చంద్రయాన్‌-2 సందర్భంగా ల్యాండింగ్‌ దగ్గరే ప్రయోగం విఫలమైంది. ఆగస్టు 23న లేదంటే 24న ల్యాండర్‌ చందమామపై దిగే అవకాశం ఉన్నది.

జూలై 14న చంద్రయాన్-3ని శ్రీహారికోట స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించింది ఇస్రో. అయితే, చంద్రుడి దగ్గరికి స్పేస్‌క్రాఫ్ట్‌ వెళ్లేందుకు వీలుగా దశలవారీగా కక్ష్యలను తగ్గిస్తున్నారు..ఈ నెల 1వ తేదీన ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ నెల 5న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది స్పేస్‌క్రాఫ్ట్‌..ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్ వర్క్ నుండి కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టారు..ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుండి వర్టికల్ దిశకు మార్చడం అత్యంత క్లిష్ట ప్రక్రియగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు..ఇక ఈ నెల 23న చుంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ విజయవంతంగా అడుగు పెట్టనుంది.

చంద్రయాన్‌ 3 గురించి ఇస్త్రో చేసిన ప్రకటన..

చంద్రయాణ్ 3 కదులుతున్న దిశ..

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..