Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిజిటల్‌ ఇండియాకి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆ ప్రాజెక్టులకు కూడా..

Digital India Programme: దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ప్రోగ్రామ్‌లోని పలు అంశాలను మరింతగా మెరుగుపరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని ఐటీ నిపుణుల నైపుణ్య స్థాయిని పెంచడం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ మేరకు భారత్‌కి చెందిన 5 లక్షల 25 వేల మంది ఐటీ నిపుణులు పొందేందుకు సిద్ధంగా..

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిజిటల్‌ ఇండియాకి కేంద్ర కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌.. ఆ ప్రాజెక్టులకు కూడా..
Union Minister Ashwini Vaishnaw
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 16, 2023 | 6:54 PM

Digital India Programme: డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ విస్తరణ పనుల కోసం కేంద్ర కేబినెట్ రూ.14,903 కోట్ల అదనపు వ్యయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయానికి అమోదం పడిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లడం, ప్రోగ్రామ్‌లోని పలు అంశాలను మరింతగా మెరుగుపరచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దేశంలోని ఐటీ నిపుణుల నైపుణ్య స్థాయిని పెంచడం డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ మేరకు భారత్‌కి చెందిన 5 లక్షల 25 వేల మంది ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలను వృద్ధి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా రానున్న రోజుటల్లో ఇది మరింత సాధికారత, శ్రామికశక్తికి దారి తీసే అవకాశం ఉంది.

అలాగే ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్‌ సెక్యూరిటీ మరింత కష్టతరంగా మారడంతో, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సామర్థ్యాలను పెంపొందించడంపై కూడా ప్రోగ్రామ్ దృష్టి సారిస్తోంది. ఇందు కోసమే 2 లక్షల 65 వేల మంది సైబర్ సెక్యూరిటీ సిబ్బంది శిక్షణ పొందనున్నారు. ఈ క్రమంలో ఉమాంగ్ ప్లాట్‌ఫామ్ గణనీయమైన ప్రోత్సాహాన్ని అందుకోనుంది. ఇప్పటికే ఉన్న 1700 సేవలకు అదనంగా 540  అద్భుతమైన 540 కొత్త మోడ్‌లు కలిశాయి. ఇవి సైటర్ సేవల యుటిలిటీ, యాక్సెసిబిలిటీని మరింతగా మెరుగుపరుస్తాయి.

ఇవి కూడా చదవండి

భారత దేశ సాంకేతిక సామర్థ్యాలను మరింతగా పెంచుతూ, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ప్రస్తుతం ఉన్న 18 ఫ్లీట్‌లకు అదనంగా మరో 9 సూపర్‌ కంప్యూటర్‌లు కలవనున్నాయి. దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలనుక మరింత శక్తి చేకూరనుంది.  ఇంకా డిజిటల్ చెల్లింపులలో కనిపించే పురోగతి మాదిరిగానే ఈ ఏడాది చివరి నాటికి సమగ్ర డిజిటల్ క్రెడిట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రోగ్రామ్ భావిస్తోంది. స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా దీనికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆరోగ్య సంరక్షణ, సుస్థిర జీవనం, వ్యవసాయం వంటి కీలకమైన రంగాలపై కూడా దృష్టి సారించే AI సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన కూడా ఉంటుంది.

కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణాయలివే..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌తో సహా విశ్వకర్మ పథకం, పీఎం ఈబస్ సేవ పథకం, ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఈ క్రమంలో విశ్వకర్మ పథకం ద్వారా చేతి వృత్తులవారికి రాయితీపై రుణాలు చేయనున్నారు. అలాగే ఆయా వృత్తులు నేర్చుకునేవారికి శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చి, రూ. 500 ఉపకారం వేతనంలో శిక్షణను అందించనున్నారు. అలాగే శిక్షణ పూర్తి అయిన తర్వాత వృత్తిపరమైన పరికరాల కొనుగోలు కోసం రూ. 15 వేల ఆర్థిక సాయం అదించనున్నారు.

ఇంకా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 10 వేల ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది దేశంలోని 169 పట్టణాల్లో నడుస్తాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూరు తెలిపారు. ఇందుకోసం ఏకంగా రూ. 57,613 కోట్లను ఖర్చు చేయనున్నారని కూడా వెల్లడించారు. దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించేందుకు 7 మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.