Delhi Metro: మెట్రో ట్రైన్‌లో మహిళల కొట్లాట.. అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగని వాగ్వాదం.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: అసాంఘీక కార్యకలాపాలను పాల్పడడం, తొటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా అసభ్యకరమైన డ్యాన్స్, అదే తరహాలో రీల్స్ తీయడం.. ఇలా ఎన్నో కారణాలతో ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియోలు అనునిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంభంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ప్రేమ, గొడవలు, డ్యాన్స్, రీల్స్‌కి సంబంధించినది కానే..
Viral Video: ఢిల్లీ లైఫ్ లైన్‌గా ప్రసిద్ధి చెందిన ‘ఢిల్లీ మెట్రో’ ఎప్పుడూ సోషల్ మీడియా ప్రపంచంలో చర్చనీయాంశంగానే ఉంటుంది. అసాంఘీక కార్యకలాపాలను పాల్పడడం, తొటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలా అసభ్యకరమైన డ్యాన్స్, అదే తరహాలో రీల్స్ తీయడం.. ఇలా ఎన్నో కారణాలతో ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియోలు అనునిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంభంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియో ప్రేమ, గొడవలు, డ్యాన్స్, రీల్స్‌కి సంబంధించినది కానే కాదు. ఇవేం లేనప్పుడు ఆ వీడియోలో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా..?
అక్కడే ఉంది ప్రత్యేకత.. బస్సు, ట్రైన్స్‌ల్లో సీట్ కోసం ఆడ, మగ భేదం లేకుండా వాగ్వాదాలు జరుగుతుంటాయి. అది సర్వసాధారణంగా జరిగేదే. కానీ తాజాగా జరిగిన గొడవ సీట్ కోసం కాదు. ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు నిలుచోవడానికి స్థలం ఇవ్వలేదని గొడవ పడ్డారు. ముందుగా ఒకరిని ఒకరు నెట్టుకోబోతుండగా ఇతరులు వచ్చి వారిని అడ్డుకుంటారు. అలా తన్నులాటకు తెర పడిన, వారి వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. అయితే దీని అంతటినీ అదే మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీడియోగా చిత్రీకరించి నెట్టింట పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. Ghar Ke Kalesh అనే ట్విట్టర్ హ్యండిల్ నుంచి షేర్ అయిన వీడియో ట్వీట్‌లో మీరు వారి గొడవకు సంబంధించిన దృశ్యాలను వీక్షించవచ్చు.
Kalesh b/w Two Woman inside Delhi metro over not giving place to stand pic.twitter.com/8a11cfg1Hz
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 15, 2023
మరో వైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరికి ఏసీ ఉన్న మెట్రో ట్రైన్ ప్రయాణం కంటే ఇరుకు ఇరుకుగా ఉండే ఆటో ప్రయాణమే నచ్చుతుందని, బోర్‌గా ఫీల్ అవుతున్నవారు ఢిల్లీ మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తే చాలు ఖుషీ ఖుషీగా ఉంటారని, ఆడవాళ్లకి ప్రత్యేకంగా ఒక కోచ్ ఇవ్వడంతో పాటు ప్రతి కోచ్‌లో 8 రిజర్వ్ సీట్లు కూడా ఇచ్చినా వీళ్లకి సీట్లు దొరకడం లేదంటూ పలువురు నెటిజన్లు కామెంట్ రూపంలో తమ అభిప్రాయాలను తెలియ జేశారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటి వరకు దాదాపు 59 వేల వీక్షణలు, 5 వందలకు పైగా లైకులు లభించాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..