Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prithvi Shaw: 244, 125* కొట్టినా వీడని దరిద్రం.. వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఇంటికొచ్చేస్తున్న ఫృథ్వీషా.. ఎందుకంటే..?

Prithvi Shaw: ఇంగ్లాండ్ గడ్డపై లిస్ట్ ఏ వన్డే వరల్డ్ కప్ కోసం నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు సోమర్‌సెట్‌పై డబుల్ సెంచరీ, డర్హామ్‌పై సెంచరీతో భీభత్సం సృష్టించాడు. ఈ టోర్నీలో అద్భుతంగా రాణంచిన ఫృథ్వీ షా చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటుంన్నాడు. చివరి సారిగా 2021 జూలైలో భారత్ జట్టు తరఫున ఆడిన ఈ యువ ఆటగాడికి..

Prithvi Shaw: 244, 125* కొట్టినా వీడని దరిద్రం.. వరల్డ్‌కప్ టోర్నీ నుంచి ఇంటికొచ్చేస్తున్న ఫృథ్వీషా.. ఎందుకంటే..?
Prithvi Shaw
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 16, 2023 | 6:03 PM

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న వన్డే కప్ టోర్నీలో భారత యువ ఆటగాడు ఫృథ్వీ షా అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేశాడు. కానీ ఆ రెండు మ్యాచ్‌ల తర్వాత ఫృథ్వీ షా అనూహ్యంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇంగ్లాండ్ గడ్డపై నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్న ఈ యువ ఆటగాడు సోమర్‌సెట్‌పై డబుల్ సెంచరీ(153 బంతుల్లో 244 పరుగులు), డర్హామ్‌పై సెంచరీతో(76 బంతుల్లో 125* పరుగులు) భీభత్సం సృష్టించాడు. షా కొట్టిన 244 పరుగులు.. ఇంగ్లాండ్ లిస్ట్ ఎ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్.

అయితే డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఫృథ్వీ షా.. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఈ క్రమంలో అతని మోకాలికి అయిన గాయాన్ని స్కాన్ చేసిన తర్వాత అది చిన్నది కాదని తెలినట్లు నార్తాంప్టన్‌షైర్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో విషయం తెలుసుకున్న బీసీసీఐ వైద్య బృందం అతని గాయన్ని పర్యవేక్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

బాధాకరం: నార్తాంప్టన్‌షైర్

సెంచరీ సెలెబ్రేషన్స్..

దంచికొడుతున్న షా.. 

మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరం.. 

రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా

ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా రాణంచిన ఫృథ్వీ షా చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉంటుంన్నాడు. చివరి సారిగా 2021 జూలైలో భారత్ జట్టు తరఫున ఆడిన ఈ యువ ఆటగాడికి.. ఆ తర్వాత మళ్లీ అవకాశం రాలేదు. ఇటీవల జరిగిన ఐపీఎల్ టోర్నీలో కూడా ఆకట్టుకోలేకపోవడంతో.. జట్టులోకి పునరాగమనం కష్టంగా మారింది. ఈ కారణంగానే చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడలకు కూడా షా ఎంపిక కాలేదు.