Cat in Back Pack: పిల్లిని చంకలో కాదు.. బ్యాగ్‌లో పెట్టుకొని వెళ్తున్న యువతి.. వీడియో వైరల్.
పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్లినట్టు అని సామెత చెబుతారు పెద్దలు. కానీ ఇక్కడ ఓ యువతి ఆఫీసుకు వెళ్తూ పిల్లిని సంచిలో పెట్టుకొని వెళ్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత కాలంలో కుక్కలతో పాటు పిల్లులను కూడా పెంచుకోవడం బాగా పెరిగింది. అవికూడా కుక్కలాగే విశ్వాసంగా ఉంటున్నాయి. అలా ఓ యువతి పెంచుకుంటున్న పిల్లిపిల్లను ఇంట్లో ఒంటరిగా..
పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన వేసుకెళ్లినట్టు అని సామెత చెబుతారు పెద్దలు. కానీ ఇక్కడ ఓ యువతి ఆఫీసుకు వెళ్తూ పిల్లిని సంచిలో పెట్టుకొని వెళ్తోంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుత కాలంలో కుక్కలతో పాటు పిల్లులను కూడా పెంచుకోవడం బాగా పెరిగింది. అవికూడా కుక్కలాగే విశ్వాసంగా ఉంటున్నాయి. అలా ఓ యువతి పెంచుకుంటున్న పిల్లిపిల్లను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టంలేక తనతోపాటే ఆఫీసుకు తీసుకెళ్తోంది. తని పెంపుడు పిల్లిని బ్యాక్ ప్యాక్‌లో పెట్టుకొని స్కూటర్‌పైన వెళ్తున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి నెట్టింట షేర్ చేశారు. బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ స్కూటర్‌పై బ్యాక్‌ప్యాక్‌లో కూర్చున్న పిల్లి ఎంతో చురుకుగా కనిపించింది. ఈ వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. మీ ఫ్రెండ్ అయిన పెంపుడు పిల్లిని మీ వెంట తీసుకుని ఆఫీసుకు వెళ్లడం.. క్యూట్ ఐడియా. ఈ దృశ్యం తన కంటపడగానే స్నేహితులతో పంచుకోవాలనిపించిందని, ఇది తన దృష్టిని ఆకర్షించిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లడం కొత్త విషయం కాదని తనకు తెలుసని, ఇక్కడ యువతి అంత సేఫ్‌గా పిల్లిని తీసుకెళ్లడం తాను ఈరోజే ప్రత్యక్షంగా చూడగలిగానని తన ట్వీటట్లో రాసుకొచ్చారు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. పెంపుడు జంతువులతో తమకున్న అనుబంధాన్ని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

