- Telugu News Photo Gallery Cricket photos BCCI loses blue tick verification on X after PM Narendra Modi’s ‘HarGharTiranga’ appeal
BCCI Twitter: బీసీసీఐ ట్విట్టర్ నుంచి బ్లూ టిక్ మాయం.. అసలు కారణం ఏమిటో తెలియక అయోమయంలో క్రికెట్ ప్రపంచం..
BCCI Twitter: ఆదివారం అగస్టు 13న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి బ్లూ టిక్ అకస్మాత్తుగా తొలగించబడింది. ఇది చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ బోర్డ్ అయిన బీసీసీఐ ట్విట్టర్ హ్యండిల్ బ్లూ టిక్‌ని తొలగించడమేంటని క్రికెట్ ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఈ క్రమంలో అసలు బీసీసీఐ ట్విట్టర్ నుంచి బ్లూ టిక్ తొలగించడానికి గల కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 14, 2023 | 7:59 AM

BCCI Twitter: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆదివారం బ్లూ టిక్ తొలగించబడింది. దీనికి కారణం ఏమిటో తెలియక చాలా మంది గూగుల్‌ల్లో సెర్చ్ చేస్తున్నారు.

బీసీసీఐ ట్విట్టర్ నుంచి బ్లూ టిక్ తొలగిపోవడానికి కారణం..ప్రొఫైల్ పిక్ మార్చడమే. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’కు మద్దతుగా బీసీసీఐ సోషల్ మీడియా టీమ్.. ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌ని మార్చింది.

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుందామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపును అనుసరించి బీసీసీఐ తన ప్రొఫైల్ పిక్‌ని మార్చి త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టింది.

ట్విట్టర్ లేదా ఎక్స్ కొత్త నిబంధనల ప్రకారం, ప్రొఫైల్ ఫోటోను మార్చడం వలన యూజర్ ఐడీ నుంచి బ్లూ టిక్ తొలగించబడుతుంది. ఈ నిబంధన కారణంగానే బీసీసీఐ ట్విట్టర్ నుంచి బ్లూ టిక్ తొలగించబడింది.

బీసీసీఐ ట్విట్టర్ మాత్రమే కాదు.. BCCI మహిళల ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఇదే విధంగా బ్లూ టిక్ తొలగించబడింది. మహిళల ట్విట్టర్ హ్యండిల్‌కి కూడా ప్రొఫైల్ ఫోటో మారడమే కారణం.





























