- Telugu News Photo Gallery Cricket photos IND vs IRE India Tour of Ireland for 3 t20is When and Where to Watch?
IND vs IRE: ఆగస్ట్ 15న ఐర్లాండ్ వెళ్లనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
India Tour of Ireland: ఐర్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న జరగనుండగా, రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. ఇక చివరి, 3వ మ్యాచ్ ఆగస్టు 22న జరగనుంది. డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లన్నింటికీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
Updated on: Aug 14, 2023 | 11:10 AM

భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటన ముగిసింది. టెస్టు, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్‌ను కోల్పోయింది. టీ20 సిరీస్ ఓటమి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న భారత యువ జట్టు కరేబియన్ టూర్‌ను పూర్తి చేసింది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్ వెళ్లేందుకు సిద్ధమైంది.

ఐర్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. రేపు ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీమిండియా ఐర్లాండ్ వెళ్లనుంది. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో భారత్ ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.

ఆగస్టు 18 నుంచి భారత్-ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆగస్ట్ 15న టీమిండియా డబ్లిన్ వెళ్లనుంది. ఈ టోర్నీకి భారత సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందికి కూడా విశ్రాంతినిచ్చారు.

ఐర్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ ఆగస్టు 18న జరగనుండగా, రెండో మ్యాచ్ ఆగస్టు 20న జరగనుంది. ఇక 3వ మ్యాచ్ ఆగస్టు 22న నిర్వహించనున్నారు. డబ్లిన్‌లోని మలాహిడే క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లన్నింటికీ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత కాలమానం ప్రకారం భారత్, ఐర్లాండ్ మధ్య రాత్రి 7:30 గంటలకు టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. వయాకామ్ 18 ప్రత్యక్ష ప్రసార హక్కులను కలిగి ఉంది. స్పోర్ట్ 18లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. జియో సినిమాలో స్ట్రీమింగ్ ఉంటుంది.

ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బీసీసీఐ మరింత మంది యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్ లభించింది. ప్రసీద్ధ్ కృష్ణ, శివమ్ దూబే తిరిగి జట్టులోకి రాగా, రింకూ సింగ్, జితేష్ శర్మలకు అవకాశం లభించింది. రాబోయే ఆసియా కప్, ICC ODI ప్రపంచ కప్ కోసం జట్టును రూపొందించడంలో ఇది సహాయపడుతుందని వర్గాలు తెలిపాయి.

భారత టీ20 జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణో సుందర్ , అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, ప్రసీద్ధ్ కృష్ణ.

ఐర్లాండ్ టీ20 జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, రాస్ అడైర్, లోర్కాన్ టక్కర్, హ్యారీ టక్కర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, ఫియాన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, థియో వైట్ వాన్ వెర్కామ్, క్రెయిగ్ యుంగ్.





























