Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 16 కత్తిపోట్లతో చావుబ్రతుకుల మధ్య యువతి.. ప్రాణం కాపాడిన దెయ్యం.. వెరీ ఇంట్రస్టింగ్ స్టోరీ..

దెయ్యాలకు సంబంధించి రకరకాల కథనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా ఉన్నప్పటికీ.. ప్రజలను మాత్రం పదే పదే ఆలోచింపజేస్తుంది. ఈ నేపథ్యంలోనే దయ్యాల నేపథ్యంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి. వీటిని ప్రజలు నమ్మకపోవచ్చు, కానీ ఈ సినిమాలు ఖచ్చితంగా ప్రజలను కాస్త అయినా భయపెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం దెయ్యాలకు సంబంధించిన ఓ సంఘటన వార్తల్లో నిలుస్తోంది. తన ప్రియుడు తనను చంపేందుకు ప్రయత్నించాడని, అయితే..

Viral News: 16 కత్తిపోట్లతో చావుబ్రతుకుల మధ్య యువతి.. ప్రాణం కాపాడిన దెయ్యం.. వెరీ ఇంట్రస్టింగ్ స్టోరీ..
Ghost Saved Life
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2023 | 1:49 PM

భూత ప్రేత పిశాచాలు, దెయ్యాల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరు తాము దెయ్యాలను చూశామని, వాటితో మాట్లాడామాని మరికొందరు.. దెయ్యం గియ్యం ఏమీ లేవని ఇంకొందరు రకరకాలుగా చెబుతుంటారు. దెయ్యాలకు సంబంధించి రకరకాల కథనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా ఉన్నప్పటికీ.. ప్రజలను మాత్రం పదే పదే ఆలోచింపజేస్తుంది. ఈ నేపథ్యంలోనే దయ్యాల నేపథ్యంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి. వీటిని ప్రజలు నమ్మకపోవచ్చు, కానీ ఈ సినిమాలు ఖచ్చితంగా ప్రజలను కాస్త అయినా భయపెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం దెయ్యాలకు సంబంధించిన ఓ సంఘటన వార్తల్లో నిలుస్తోంది. తన ప్రియుడు తనను చంపేందుకు ప్రయత్నించాడని, అయితే ఓ దెయ్యం తన ప్రాణాలను కాపాడిందని ఓ అమ్మాయి చెప్పడం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆ అమ్మాయి పేరు ఎలిష్ పో. ఆమె వయస్సు 25 సంవత్సరాలు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. ఎలిష్ ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె.. తన జీవితంలో జరిగిన దెయ్యం ఘటనను వెల్లడించింది. టెక్సాస్‌కు చెందిన ఎలిష్, 2020 సంవత్సరంలో తన మాజీ ప్రియుడు తనపై దారుణంగా దాడికి పాల్పడ్డాడని చెప్పింది. ఆమెను 16 సార్లు కత్తితో పొడిచి, చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే.. ఎలిష్‌కు మూడు దెయ్యాలు కనిపించాయట. ఆమెకు అవి ఒక విచిత్రమైన రూపంలో కనిపించాయట.

మూడు దెయ్యాలను చూసి..

మాజీ ప్రియుడి దాడిలో గాయపడిన ఎలీష్‌కు ఆ సమయంలో సాయం చేసేవారు లేరు. ఆమె రక్తపు మడుగులో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఇంతలో ఆమెకు బాత్రూమ్ తలుపు వద్ద తన అమ్మమ్మ జెన్నీ ఆత్మను చూసిందట. వాస్తవానికి ఎలిష్ అమ్మమ్మ 2014లోనే చనిపోయారు. మరొకరు తన స్నేహితులలో ఒకరని చెప్పుకొచ్చింది. అతను 2020లో ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ ఇద్దరూ తనను చూస్తూ నవ్వుతున్నారట. వీరిద్దరితో పాటు బంధువులకు చెందిన మరొకరి ఆత్మ కూడా ఎలీష్‌కు కనిపించిందట. ఈమె మాత్రం తనను కాపాడిందని చెబుతోంది ఎలీష్.

ప్రాణాలను కాపాడిన దెయ్యం..

అలిస్సా బర్కెట్ అనే మహిళ ఆత్మ తనను చూస్తూ నిలిచిపోయింది. ఆమె కూడా టెక్సాస్‌కు చెందినది మహిళ అని, ఆమె మాజీ ప్రియుడిచే కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిందని చెప్పుకొచ్చింది ఎలీష్. అయితే, అలిస్సా దెయ్యం.. ఎలీషాకు సహాయం చేసిందట. తనను ఫోన్ వద్దకు తీసుకెళ్లి, పోలీసులకు ఫోన్ చేసేలా ప్రోత్సహించిందట. ఆ దెయ్యం సహకారంతో ఎలీష్ పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. దాంతో పోలీసులు వెంటనే వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలా పోలీసులు ఆమె ప్రాణాలను కాపాడారు. అయితే, ఆస్పత్రిలో కోలుకుంటున్న సందర్భంలోనూ 50 నుంచి 100 సార్లు అస్పష్టమైన రూపాలు కనిపించాయని చెప్పుకొచ్చింది ఎలీష్. అంతేకాదండోయ్.. నిర్దిష్ట సమయంలో తప్ప దెయ్యాలు ఎప్పుడూ కనిపించవని చెప్పింది. మొత్తానికి తన ప్రాణాలు కాపాడిన దెయ్యానికి ఎలీష్ కృతజ్ఞతలు తెలిపింది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..