Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ వారిలో వేగంగా పెరుగుతుంది.. కీలక ‘లింక్’ని కనిపెట్టిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు..

హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనిపెట్టారు. ఈ రొమ్ము క్యాన్సర్ ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుందని గుర్తించారు పరిశోధకులు. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ, అభివృద్ధి దశలను ఊబకాయం ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధనల్లో కనిపెట్టారు. ఈ ప్రయోగానికి ఎలుకలను ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు. వాటి నమూనాలను ఉపయోగించి చేసిన ప్రయోగంలో.. ఊబకాయం ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్ వేగంగా వృద్ధి చెందినట్లు..

Breast Cancer: రొమ్ము క్యాన్సర్ వారిలో వేగంగా పెరుగుతుంది.. కీలక ‘లింక్’ని కనిపెట్టిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు..
Breast Cancer
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 16, 2023 | 1:18 PM

ఈ మధ్య కాలంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మహిళల్లో ఎక్కువ కేసులు నమోదవుతుండగా.. పురుషుల్లోనూ కొన్ని కేసులు నమోదు అవుతున్నాయి. అయితే, రొమ్ము క్యాన్సర్‌ విషయంలో హైదరాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని కనిపెట్టారు. ఈ రొమ్ము క్యాన్సర్ ఊబకాయం ఉన్నవారిలో ఎక్కువగా వస్తుందని గుర్తించారు పరిశోధకులు. రొమ్ము క్యాన్సర్ ప్రారంభ, అభివృద్ధి దశలను ఊబకాయం ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధనల్లో కనిపెట్టారు. ఈ ప్రయోగానికి ఎలుకలను ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు. వాటి నమూనాలను ఉపయోగించి చేసిన ప్రయోగంలో.. ఊబకాయం ఉన్న వారిలో రొమ్ము క్యాన్సర్ వేగంగా వృద్ధి చెందినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మాలిక్యులర్ సైన్సెస్‌లో ప్రచురించారు.

ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం ద్వారా ఊబకాయం, క్యాన్సర్ ప్రారంభ దశ, అభివృద్ధి దశ మధ్య ఉన్న కీలకమైన లింక్‌ను గుర్తించడం సులభమైందని జర్నల్‌లో పేర్కొన్నారు. పరిశోధకులు బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్‌తో ఊబకాయ ఎలుక నమూనాలను అభివృద్ధి చేశారు. అంటే వాటిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పటికీ మధుమేహాన్ని నిర్ధారించడానికి తగినంత ఆధారాలు లేకుండా చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకులు సన్నని ఎలుకలు, ఊబకాయంతో ఉన్న ఎలుకలను తీసుకున్నారు. వీటిలోకి క్యాన్సర్ కారక కణమైన ఇమ్యునోసప్రెసర్ అయిన DMBAను ఎక్కించారు. అయితే, ‘సన్నని ఎలుకల్లో కంటే.. ఊబకాయంతో ఉన్న ఎలుకల్లో రొమ్ము క్యాన్సర్ వేగంగా అభివృద్ధి చెందింది. ఊబకాయం ఉన్న ఎలుకల్లో డీఎంబీఏ వృద్ధి 9వ వారం తర్వాత గుర్తించే స్థాయికి వృద్ధి చెందింది. అదే సమయంలో సన్నని ఎలుకల్లో 26వ వారం తరువాత గమనించడానికి వీలు పడింది’ అని అధ్యయనంలో పేర్కొన్నారు.

ఇమ్యునోసప్రెసర్‌ని 32 వారాలపాటు నిర్వహించిన తర్వాత, ఉత్పరివర్తన చెందిన స్థూలకాయ ఎలుకలలో 62 శాతం క్షీర కణితులను అభివృద్ధి చెందాయి. అయితే, సన్నని ఎలుకల్లో 21 శాతం మాత్రమే రొమ్ము కణితులు అభివృద్ధి చెందాయి. సగటున, స్థూలకాయ ఎలుకలలో కణితి అభివృద్ధి చెందడానికి 119 రోజులు పట్టింది, అదే సమయంలో సన్నని ఎలుకల్లో 211 రోజులు పట్టింది. దీర్ఘకాలిక వ్యాధుల పురోగతిపై ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్‌పై ఊబకాయం, బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్ ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఉత్పరివర్తన చెందిన ఊబకాయ ఎలుకలు అద్భుతమైన నమూనాగా పనిచేశాయని పరిశోధన నిర్ధారించింది. ఊబకాయం.. IGT అపోప్టోసిస్ (ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ జీవ ప్రక్రియ) నిరోధించడం, కణాల విస్తరణను ప్రోత్సహించడం ద్వారా క్యాన్సర్ అభివృద్ధిని సులభతరం చేస్తుందని అధ్యయనం తెలిపింది. పర్యవసానంగా.. ఊబకాయం ఎలుకలలో క్యాన్సర్ కణితి అభివృద్ధి, పురోగతి గణనీయంగా పెరిగింది. నివారణ, చికిత్స కోసం సమర్థవంతమైన వ్యూహాలను అభివృద్ధి చేయడానికి ఊబకాయం, రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ప్రాముఖ్యతను ఈ పరిశోధనలు నొక్కిచెప్పాయి.

కాగా, యుటి సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్, టెక్సాస్, యుఎస్ నుండి సీనియర్ శాస్త్రవేత్త ఆర్ కేశవన్, అన్నామలై విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగానికి చెందిన సీనియర్ పరిశోధకుడు సిద్దవరం నాగిని సహకారంతో అధ్యయనంలో భాగమైన ఎన్ఐఎన్ పరిశోధకులలో డాక్టర్ జి భాను ప్రకాష్ రెడ్డి, కళ్లమాడి ప్రతాప్ రెడ్డి, దీప్షిఖ ఎసరి, ఉత్కర్ష్ రెడ్డి అడ్డి, పి ఉదయ్ కుమార్ ఉన్నారు.

మరిన్ని సైన్స్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..