AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: అయ్యో చిట్టితల్లీ.. పొరపాటున నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి..!

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న పలివెల రాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ధన్యశ్రీ (4) మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో పక్క ఇంట్లో నాటు తుపాకీ పేలింది. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్‌ నేరుగా వచ్చి ధన్యశ్రీ చాతిని చీల్చుకుంటూ బయటికి వెళ్లింది. అంతా క్షణకాలంలో జరిగిపోయింది..

Kakinada: అయ్యో చిట్టితల్లీ.. పొరపాటున నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి..!
Dhanya Sri
Srilakshmi C
|

Updated on: Aug 16, 2023 | 9:46 AM

Share

కాకినాడ, ఆగస్టు 16: ముద్దుముద్దు మాటలు చెబుతూ.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా మారింది. పరుగుపరుగునా వెళ్లిన తల్లిదండ్రులను చిన్నారిని చేతుల్లోకి తీసుకోగా వారి చేతులు రక్తంతో తడిసిపోయాయి. గుండెలు బాదుకుంటూ పరుగుపరుగున ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా తుని మండలంలో మంగళవారం ఉదయం (ఆగస్టు 15) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న పలివెల రాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ధన్యశ్రీ (4) మంగళవారం ఉదయం ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో పక్క ఇంట్లో నాటు తుపాకీ పేలింది. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్‌ నేరుగా వచ్చి ధన్యశ్రీ చాతిని చీల్చుకుంటూ బయటికి వెళ్లింది. అంతా క్షణకాలంలో జరిగిపోయింది. ఈ ఘటనలో బుల్లెట్‌ చిన్నారి వీపులో నుంచి ఛాతిలోకి దూసుకుపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాని తల్లిదండ్రులు చిన్నారిని పరుగుపరుగు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు దృవీకరించారు.

అప్పటి వరకూ కళ్లముందు సందడిగా అడుకుంటున్న బిడ్డ ఇకలేదని తెలియడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సీఐ సన్యాసిరావు, ఎస్సై విజయబాబు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఇంటికి సమీపంలో ఉన్న సిద్ధాంతపు దుర్గాప్రసాద్‌ అనే వ్యక్తి పందులను కాల్చేందుకు నాటు తుపాకీలో మందుగుండ్లు దట్టిస్తుండగా అది పొరపాటున పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు