AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: పెట్రోల్‌ బంకులో భారీ పేలుడు.. 12 మంది మృతి, 60 మందికిపైగా తీవ్ర గాయాలు

దక్షిణ రష్యాలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందారు. సుమారు 60 మందికిసైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రష్యాలోని కాకసస్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని ఫిల్లింగ్ స్టేషన్‌లో అక్కడి కాలమానం ప్రకారం సోమవారం (ఆగస్టు 14) అర్ధరాత్రి ఈ భారీ పేలుడు సంభవించినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది..

Russia: పెట్రోల్‌ బంకులో భారీ పేలుడు.. 12 మంది మృతి, 60 మందికిపైగా తీవ్ర గాయాలు
Explosion At Gas Station In Russia
Srilakshmi C
|

Updated on: Aug 15, 2023 | 9:40 AM

Share

మాస్కో, ఆగస్టు 15: దక్షిణ రష్యాలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందారు. సుమారు 60 మందికిసైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రష్యాలోని కాకసస్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని ఫిల్లింగ్ స్టేషన్‌లో అక్కడి కాలమానం ప్రకారం సోమవారం (ఆగస్టు 14) అర్ధరాత్రి ఈ భారీ పేలుడు సంభవించినట్లు అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

మఖచ్కలాలో కాస్పియన్‌ సముద్రం ఒడ్డున ఉన్న ఈ నగరంలో హైవే పక్కన ఉన్న కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌లో తొలుత మంటలు చెలరేగాయి. అనంతరం ఉన్న పెట్రోల్‌ బంకుకు మంటలు వ్యాపించాయి. దీంతో పెట్రోల్‌ బంకులో పెద్దఎత్తున పేలుడు సంభవించినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.

మంటల తీవ్రత అధికం కావడంతో పరిసర ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. కార్ల భవనం నుంచి ఎగసిపడుతోన్న మంటలు, ఆ తర్వాత భారీ పేలుడుకు సంభవించినట్లు ఉన్న వీడియోను రియా నోవోస్టి అనే స్థానిక వార్తా సంస్థ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దాదాపు 6,450 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. 260 ఫైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కార్ల భవనంలోని వాహనాలు పూర్తిగా మంటల్లో దగ్దమయ్యాయి.

ఇవి కూడా చదవండి

కర్ణాటకలో దారుణం..ప్రియున్ని వదులుకోలేక చపాతీలో నిద్రమాత్రలు కలిపి హత్య..

ప్రేమికుడితో సంతోషంగా జీవించడానికి అడ్డుగా ఉన్న భర్తను హతమర్చిందో భార్య. కడూరు తాలూకా హనుమనహళ్లికి చెందిన పావనికి నవీన్‌ (29)తో పావనికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల చిన్నారి ఉంది. ఇటీవల పావనికి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం నవీన్‌కు తెలియగా భార్యను నిలదీశాడు. పెద్దలు రాజీ కుదిర్చారు. ఐతే ప్రియున్ని వదులుకోలేని పావని నవీన్‌ను అడ్డుతొలగించు కోవాలని అనుకుంది.

చపాతీ పిండిలో నిద్రమాత్రలు కలిపి వాటితో చపాతీ తయారు చేసి భర్తకు వడ్డించింది. చపాతీ తిన్న నవీన్‌ నిద్రలోకి వెళ్లగానే ప్రియునితో కలిసి హత్య చేసింది. అనంతరం నవీన్‌ మృత దేహాన్ని తమ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో పడేసింది. ఏమీ ఎరగనట్లు అప్పుల బాధతోనే నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మబలికింది. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటపడింది. దీంతో చిక్కమగళూరు జిల్లా యగటి పోలీసులు పావనిని, ఆమె ప్రియుడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.