AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌లో దుమారం లేపుతోన్న హీరో నాని వ్యాఖ్యలు.. ‘నువ్వెంత.. నీ రేంజ్‌ ఎంత..?’

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అందరికీ సుపరిచితమే. దుల్కర్ సల్మాన్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించిన తాజా మువీ 'కింగ్ ఆఫ్ కోతా' పాన్‌ ఇండియా స్థాయిలో ఆగష్టు 24న విడుదలకానున్న సంగతి తెలిసిందే. అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాన్‌ ఇండియా హీరోల గురించి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి..

టాలీవుడ్‌లో దుమారం లేపుతోన్న హీరో నాని వ్యాఖ్యలు.. 'నువ్వెంత.. నీ రేంజ్‌ ఎంత..?'
Natural Star Nani
Srilakshmi C
|

Updated on: Aug 15, 2023 | 12:03 PM

Share

నేచులర్‌ స్టార్‌ నానిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. అదేంటి నానిని ఇష్టపడని వారు, అభిమానించని వారు కూడా ఉంటారా? అని సందేహిస్తున్నారా.. కారణం అదికాదండీ.. తాజాగా పాన్‌ ఇండియా స్టార్‌ హీరో గురించి నాని చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌కు సుతారం నచ్చలేదు. దీంతో నానిని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ అందరికీ సుపరిచితమే. దుల్కర్ సల్మాన్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించిన తాజా మువీ ‘కింగ్ ఆఫ్ కోతా’ పాన్‌ ఇండియా స్థాయిలో ఆగష్టు 24న విడుదలకానున్న సంగతి తెలిసిందే. అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాన్‌ ఇండియా హీరోల గురించి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

‘పాన్ ఇండియా సినిమాలని మనం అంటున్నాం. పాన్ ఇండియా సినిమా అనే పదం నాకు పెద్దగా నచ్చదు. కానీ, నాకు తెలిసిన యాక్టర్స్‌లో పాన్‌ ఇండియా యాక్టర్‌ అంటే అది దుల్కర్‌ మాత్రమే. ఎందుకంటే హిందీ, తెలుగు, తమిళ, మలయాళ దర్శకులు అందరూ దుల్కర్‌ కోసం స్క్రిప్ట్‌ రాసుకుంటారు. ఓ పాన్ ఇండియా యాక్టర్‌కు నిజమైన నిర్వచనం ఇదేనని’ నాని మాట్లాడాడు. దీంతో టాలీవుడ్‌ పాన్‌ ఇండియా హీరోల ఫ్యాన్స్‌ నానిపై ఫైర్‌ అవుతున్నారు. దుల్కర్‌ మంచి నటుడే, పాన్‌ ఇండియా రేంజ్‌ అందుకునే అర్హత కూడా ఆయనకు ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దుల్కర్‌ మాత్రమే పాన్‌ ఇండియా హీరో అని ఎలా చెబుతావ్‌.. అంటూ నానిని ఓ రేంజ్‌లో టాలీవుడ్‌ హీరోల ఫ్యాన్స్‌ ఏకిపారేస్తున్నారు.

‘పాన్‌ ఇండియా రేంజ్‌కి నువ్వు ఎప్పటికీ చేరుకోలేవు కాబట్టే ఆ పదం నీకు పెద్దగా నచ్చదు. పాన్‌ ఇండియా జెండా పాదిన తొలి టాలీవుడ్ హీరో ప్రభాస్‌. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ వీళ్లంతా గల్లీ హీరోలు అనుకుంటున్నావా..? ఒకరికి పాన్‌ ఇండియా హీరో అని గుర్తింపు ఇవ్వడానికి నువ్వెవడివి..? సినిమాలు చూసేది మేము.. గుర్తింపు ఇవ్వాల్సింది మేము.. కాస్త నోటిదూల తగ్గించుకుంటే మంచిదంటూ అభిమానులు నానికి బాగానే క్లాస్‌ పీకారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..
గొంతులు కోస్తున్న మాంజా.. కీసరలో విషాదం.. యువకుడికి 19కుట్లు..