Taapsee Pannu: ఆ ఇద్దరు హీరోలు నన్ను వేధించారు .. షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ
మీడియా ముందుకు వచ్చి మరి తాము లైంగిక వేధింపులకు గురయ్యామని కొంతమంది నటులు తెలిపారు. తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి బయట పెట్టి షాక్ ఇచ్చారు. తాజాగా తాప్సీ కూడా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ గురైనట్టు తెలిపి షాక్ ఇచ్చింది. ఓ ఇద్దరు హీరోలు తనను వేధించారని తెలిపింది తాప్సీ. దర్శకేద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది తాప్సీ

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ముదురుతోంది. గతంలో కొంతమంది సినీ నటులు తాము లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. మీడియా ముందుకు వచ్చి మరి తాము లైంగిక వేధింపులకు గురయ్యామని కొంతమంది నటులు తెలిపారు. తమ జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి బయట పెట్టి షాక్ ఇచ్చారు. తాజాగా తాప్సీ కూడా తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ గురైనట్టు తెలిపి షాక్ ఇచ్చింది. ఓ ఇద్దరు హీరోలు తనను వేధించారని తెలిపింది తాప్సీ. దర్శకేద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఝమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది తాప్సీ. తొలి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా రాణించింది. అదే సమయంలో బాలీవుడ్ కు చెక్కేసింది.
అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతే కాదు పలు వివాదాల్లోనూ ఇరుక్కుంది. కంగనా పై కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది తాప్సీ. ఇదిలా ఉంటే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసి మరో సారి బీ టౌన్ లో బాంబ్ పేల్చింది.
సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువ అని తెలిపి షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లోకి వచ్చిన కొత్తలో చాలా మంది ఫోన్ చేసి రాత్రి గెస్ట్ హౌస్ కు రమ్మని పిలిచారు అని తెలిపింది. నేను రాను అని చెప్పిన కూడా వినేవారు కాదు నన్ను వేధించేవారు. ఇద్దరు హీరోలు తమతో డేటింగ్ చేయాలనీ వేధించారు. చెప్పినట్టు వినకపోతే సినిమా ఛాన్స్ లు రానివ్వమని బెదిరించారని తెలిపింది. హీరోలే కాదు కొంతమంది దర్శకులు కూడా అలానే వేధించారని తెలిపింది తాప్సీ.
View this post on Instagram
తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రోజు ఆమె షేర్ చేసే పోస్ట్లు వైరల్ అవుతూ ఉంటాయి.
View this post on Instagram
తాప్సీ పన్ను సోషల్ మీడియా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.