Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Kaaram: మహేష్ గుంటూరు కారం సినిమాను గురూజీ అలా ప్లాన్ చేస్తున్నారట !

ఖలేజా సినిమాతర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ , త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Guntur Kaaram: మహేష్ గుంటూరు కారం సినిమాను గురూజీ అలా ప్లాన్ చేస్తున్నారట !
Gunturu Kaaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 15, 2023 | 11:18 AM

మహేష్ బాబు నటిస్తున్న న్యూ మూవీ గుంటూరు కారం. ఈ సినిమాకోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఖలేజా సినిమాతర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ , త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమాలో చిరంజీవి మాస్ మసాలా పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా నిజానికి ఎప్పుడో మొదలైనా అనేక కారణాల కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా గుంటూరు మార్కెట్ యార్డ్ నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని తెలుస్తోంది. మహేష్ బాబు విదేశాల్లో తన బర్త్ డేను జరుపుకొని రీసెంట్ గా ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ గా షూటింగ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారట మహేష్. ఈ నెల 16 నుంచి గుంటూరు కారం మూవీ నయా షెడ్యూల్ మొదలు కానుందని తెలిసింది. మహేశ్ 20వ తేదీని నుంచి సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట.  రెండు నెలల పాటు సాగేలా ఓ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. ఇక పై ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఈ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట గురూజీ. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

గుంటూరు కారం పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.