AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పటికీ మగాళ్లు భార్య కన్యగానే కావాలంటున్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సాధారణంగా సినీరంగంలో కథానాయికగా ఓ గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు, అవమానాలు భరించాలి. కొంతమంది హీరోయిన్స్ చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ మగాళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికీ మగాళ్లు భార్య కన్యగానే కావాలంటున్నారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 18, 2026 | 3:03 PM

Share

కొంతమంది హీరోయిన్స్ చేసే కామెంట్స్ ఊహించని వివాదంలో చిక్కుకుంటున్నాయి. కొంతమంది తెలిసి తెలియక వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం వివాదం అవ్వాలనే కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ నటి మగాళ్ల గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పటికీ మగాళ్లు మారలేదని భార్య కన్యగానే కావాలంటున్నారని సంచలన కామెంట్స్ చేసింది ఆమె.. దాంతో ఆ నటి పై కొందరు విమర్శలు కురిపిస్తున్నారు. ఇంతకూ ఎవరు ఆ నటి.? ఎందుకు ఆ కామెంట్స్ చేసింది.?

నీనా గుప్తా.. ఈ బాలీవుడ్ నటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90’sలో సినీరంగాన్ని ఏలేసింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు.. అగ్ర హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఈ అమ్మడు సినిమాల్లో ఎంత ఫేమస్ అయ్యిందో.. వ్యక్తిగత విషయాల్లోనూ ఎక్కువగా వార్తల్లో నిలిచి పాపులర్ అయ్యింది. 30ఏళ్ల వయసులో పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది ఈ అందాల హీరోయిన్. అప్పట్లో ఆ వార్త పెద్ద సంచలనం సృష్టించింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

నీనాగుప్తా మాట్లాడుతూ.. ఇప్పటికి కూడా కన్యత్వం అంత ముఖ్యమైన అంశంగా ఉందా.? అన్న ప్రశ్నకు నీతూ సమాధానం ఇస్తూ.. ఇండియా గురించి మాట్లాడుతున్నావా.? ఇక్కడ ఇప్పుడు ఏం మారింది? అంటూ ఎదురు ప్రశ్నించింది నీనా గుప్తా. మగ వారు భార్యను కన్యగానే కోరుకుంటున్నారు అని చెప్పుకొచ్చింది. ఇక కొంతమంది పైకి స్టైల్ గా ఉంటూ.. ఇంగ్లీష్‌ మాట్లాడే మగ వారు చూడడానికి చాలా విశాల మనస్తత్వం ఉన్నట్టు కనిపిస్తారని.. కానీ కేవలం పైకి మాత్రమే అని తెలిపింది. వారు కూడా కన్యనే భార్యగా కావాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చింది నీనాగుప్తా. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Neena Gupta

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us