సౌత్ నుంచి వచ్చిన నన్ను వేరేలా చూశారు.. హీరోయిన్ కామెంట్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

17 February 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ రెజీనా కసాండ్రా. దాదాపు 20 ఏళ్లుగా దక్షిణాదిలో సినిమాలు చేస్తుంది. 

కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. అయితే తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చేదు అనుభవాలను ఎదురైనట్లు తెలిపింది. 

16 ఏళ్లకే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. రవితేజ, గోపిటచంద్, సాయి దుర్గ తేజ్, సందీప్ కిషన్ వంటి హీరోలతో పలు చిత్రాలు చేసింది. 

 ఇక హిందీలో ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా అనే సినిమాలో నటించింది. ఈ మూవీతో అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మకు ఆశించిన పేరు రాలేదు

అయితే ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదురైన పరిస్థితులు వెల్లడించింది. వాళ్ల ప్రవర్తననే తనతో వెరైటీగా ఉందని తెలిపింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం ఊహించినంత సుల‌భంగా సాగ‌లేదని.. హిందీ భాష‌పై పూర్తి పట్టు ఉన్నా.. వాళ్లతో కలిసిపోలేకపోయానని అన్నారు.

సౌత్ నుంచి వచ్చిన తనను కొందరు వేరేలా చూశారని.. తన నేపథ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

వాళ్ల ప్రవర్తన, మాట తీరు తనకు అసౌకర్యాన్ని కలిగించాయని.. అవన్నీ చూశాక.. తనలో ఒకరకమైన భయం మొదలైందని రెజీనా చెప్పుకొచ్చింది.