నటి ప్రత్యూష మరణంపై ఆమె తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె బలహీనమైన మనసున్నది కాదని, ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని స్పష్టం చేశారు. కుటుంబానికి అండగా నిలిచే ధైర్యవంతురాలైన ప్రత్యూష మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ కేసులో ఏదో రహస్యం దాగి ఉందని ఆమె పేర్కొన్నారు.