కొత్త జర్నీ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్.. ఇకపై ఇండస్ట్రీలో అలా..

Rajitha Chanti

Pic credit - Instagram

18 February 2026

సౌత్ ఇండస్ట్రీలో సహజ నటనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది నిత్యా మీనన్. చాలా కాలంగా తమిళం, మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.

2011లో అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది.

తక్కువ సమయంలోనే తెలుగులో విపరతీమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ చాలా కాలంగా ఆమె కేవలం తమిళం, మలయాళంలోనే నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ కర్మంలో తాజాగా నిత్యా మీనన్ కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లు నటిగా మెప్పించిన నిత్యా ఇప్పుడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నట్లు తెలుస్తోంది.

కేయూరి ప్రొడక్షన్స్ అనే పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ వీడియో షేర్ చేసింది నిత్యా మీనన్.

 సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదని.. ప్రేక్షకుల మనసులను లోతుగా తాకే శక్తి ఉన్న మాధ్యమమని.. లాభాలు చూడనని చెప్పుకొచ్చారు.

‘కేయూరి’ అనే పేరుకు సంబంధించిన  అర్థాన్ని సైతం వెల్లడించారు. భూమి లోతుల్లో పుట్టి, రాతితో చెక్కబడి, కాంతిని ప్రేమించే రూపం లేనిదే ‘కేయూరి’ అర్థం.

క్రియేటివిటీ ద్వారా ప్రేక్షకుల్లో ఒక మార్పు తీసుకురావాలన్నదే తన ఆశయమని నిత్యా మీనన్ వెల్లడించారు. అలాగే నటిగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నిత్యా.