AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త

Hyderabad: వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. దుండగులు ఓ మహిళను కత్తితో దారుణంగా నరికి చంపారు. కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చిన దుండగులు మహిళలు హత్య చేశారు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరికలు పోలీసులు తెలిపారు.

Hyderabad: వనస్థలిపురంలో దారుణం.. మహిళను కత్తితో నరికి చంపిన మాజీ భర్త
Murder
Subhash Goud
|

Updated on: Feb 18, 2026 | 3:30 PM

Share

Hyderabad: హైదరాబాద్‌లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు ఇలా ఒక్కటేమిటి ప్రతి రోజు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు నగరంలో మరో ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. ఓ దుండగుడు ఓ మహిళను కత్తితో దారుణంగా నరికి చంపారు. కత్తులు, పెట్రోల్ డబ్బాతో వచ్చిన దుండగులు మహిళలు హత్య చేశాడు. ఇంట్లోకి ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానంటూ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే సదరు మహిళతో తనకు గతంలో పెళ్లి అయిందని, తను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది అని మహేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us