AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!

Kitchen Hacks: వెల్లుల్లిపాయలు వలవడం అనేది చాలా సమయం తీసుకునే శ్రమతో కూడుకున్న పని. అయితే, కొన్ని సులభమైన చిట్కాలతో ఈ పనిని ఎంతో సునాయాసంగా చేయవచ్చు. ఈ ట్రిక్స్‌ పాటిస్తే వెల్లుల్లిపాయలను త్వరగా సులభంగా వలవడానికి మూడు సమర్థవంతమైన పద్ధతులు ఉన్నాయి..

Kitchen Hacks: ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.. సీక్రెట్‌ టిప్స్‌!
Garlic
Subhash Goud
|

Updated on: Feb 16, 2026 | 4:29 PM

Share

Kitchen Hacks: వంటగదిలో వెల్లుల్లిపాయలు ఒక ముఖ్యమైన పదార్థం. అయితే వాటిని వలవడం చాలా మందికి పెద్ద పనిగా అనిపిస్తుంది. ఈ శ్రమను తగ్గించి, సమయాన్ని ఆదా చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. కిలోల కొద్దీ వెల్లుల్లిని సైతం సునాయాసంగా వలవడానికి ఇక్కడ మూడు ప్రధాన పద్ధతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

మొదటి పద్ధతిలో మన ఇళ్లల్లో సర్వసాధారణంగా ఉండే పప్పుగుత్తిని ఉపయోగించాలి. వెల్లుల్లిపాయలను ఒక చోట చేర్చి, పప్పుగుత్తితో వాటిని మెల్లగా కొట్టాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రెబ్బల పైనున్న పొట్టు వదులవుతుంది. ఈ పద్ధతిలో పొట్టు త్వరగా ఊడి వస్తుంది. వెల్లుల్లిని సులభంగా వలవవచ్చు. అయితే, వెల్లుల్లిపాయలు పాడైపోకుండా, మరీ గట్టిగా కొట్టకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. నిదానంగా జాగ్రత్తగా కొట్టి పొట్టును సులభంగా తొలగించవచ్చు.

ఇది కూడా చదవండి: ఈ ప్రాంత ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈ రెండు మార్గాల్లో వందే భారత్‌ నిలిపివేత!

ఇవి కూడా చదవండి

రెండవ పద్ధతిలో నూనె, సూర్యరశ్మిని ఉపయోగించడం. వలవాల్సిన వెల్లుల్లిపాయలకు కొద్దిగా వంట నూనెను పట్టించి, చేతులతో బాగా రుద్దాలి. నూనె వెల్లుల్లి రెబ్బలన్నింటికీ పట్టేలా చూసుకోవాలి. ఆ తర్వాత, ఈ వెల్లుల్లిపాయలను సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో రెండు నుండి మూడు గంటల పాటు ఉంచాలి. ఉదాహరణకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఉంచితే, నూనె, ఎండ ప్రభావంతో పొట్టు ఎండిపోయి సులభంగా ఊడి వస్తుంది. ఈ పద్ధతి వల్ల వెల్లుల్లికి మంచి సువాసన కూడా వస్తుందని చెబుతున్నారు నిపుణులు.

మూడవ, అత్యంత వినూత్నమైన పద్ధతి ఏమిటంటే ఒక పిన్నీసును ఉపయోగించడం. సాధారణంగా వెల్లుల్లిపాయలు వలిచేటప్పుడు గోళ్లకు నొప్పి వస్తుంటుంది. ఈ సమస్యను నివారించడానికి పిన్నీసు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని, దాని మధ్యలోకి పిన్నీసును సున్నితంగా నొక్కి, కొద్దిగా లేపితే పొట్టు వెంటనే వేరుపడుతుంది. ఈ పద్ధతి గోళ్లకు నొప్పి కలిగించకుండా, పనిని చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఎన్ని కిలోల వెల్లుల్లిపాయలను అయినా ఈ పద్ధతితో తక్కువ సమయంలో వలవవచ్చు. ఎండలో పెట్టడానికి సమయం లేని వారికి లేదా వీలు కాని వారికి ఈ పిన్నీసు చిట్కా చాలా ఉపయోగపడుతుంది..

ఇది కూడా చదవండి: తలరాతనే మార్చేసింది.. 1 లక్ష రూపాయలు రూ.14 కోట్లుగా మారింది..!

వీటితో పాటు వెల్లుల్లిని ఓ బాక్స్‌లో అంటే ఇంట్లో ఉండే ఏదైనా స్టిల్‌ బాక్స్‌, ఇతర ఏదైనా బాక్స్‌లో వేసి పైకి కిందకు ఊపడం ద్వారా కూడా పొట్టును వదులు చేయవచ్చంటున్నారు. ఈ మూడు చిట్కాలు వెల్లుల్లి వలచే ప్రక్రియను చాలా సరళతరం చేస్తాయి. వంటగదిలో సమయాన్ని ఆదా చేస్తాయి. అలాగే ఇంకో పద్దతు కూడా ఉంది. వెల్లుల్లి రెబ్బలను ఓ సంచిలాంటి బ్యాగులో వేసి దానిని మూటకట్టి నెమ్మదిగా నేలకేసి కొట్టాలి. ఇలా కొట్టడం వల్ల అందులో ఉండే పొట్టు వదులుగా అవుతుంది. దీంతో వలిచేందుకు సులభం అవుతుంది. ఈ పద్దతుల ద్వారా వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు.

Indian Railways: రైలులోని లగేజీ కంపార్ట్‌మెంట్‌లో ఎక్కితే జరిమానా ఎంత? నియమాలు ఏంటి?

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు
ఇలా చేస్తే చాలు కిలోల కొద్ది వెల్లుల్లి పొట్టును సులభంగా తీయవచ్చు
రోహిత్ శర్మ చేసిన పనికి పాకిస్తాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా
రోహిత్ శర్మ చేసిన పనికి పాకిస్తాన్ ఫ్యాన్స్ సైతం ఫిదా
గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..
గ్రైండర్ వల్ల ఆ పిల్లాడి ప్రాణం పోయింది.. అసలేం జరిగిందంటే..
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిల్‌ గేట్స్: ఉండవల్లిలో అరటి తోటల పరిశీలన
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
రంగారెడ్డి రోడ్డు ప్రమాదం: హైదరాబాద్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన కారు
చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?
చూపుడు వేలు పొడవు.. మీ గురించి ఏమి చెబుతుందో తెలుసా?
క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి..
క్యూట్ క్యూట్ ఫొటోలతో మతిపోగొడుతున్న కృతి శెట్టి..
రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!
రేపే సూర్య గ్రహణం.. సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసుకోండి!
సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!
సూర్య గ్రహణం ఎఫెక్ట్ .. ఈ రాశుల వారికి అడుగడుగునా సమస్యలే!