మరో ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి.. ఆ హీరోకు జోడిగా కాంతార బ్యూటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
18 February 2026
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో రుక్మిణి వసంత్ ఒకరు. తక్కువ సమయంలోనే సినీరంగంలో గుర్తింపు తెచ్చుకుంది.
సప్త సాగరాలు దాటి సినిమాతో దక్షిణాదిలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగు, కన్నడ, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటుంది.
ఇటీవలే రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో రుక్మిణి క్రేజ్ మారిపోయింది.
ప్రస్తుతం ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
మరోవైపు తెలుగులో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. తాజాగా తెలుగు హీరో శర్వానంద్ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్.
ఇటీవలే నారీ నారీ నడుమ మురారి సినిమాతో హిట్టు అందుకున్న శర్వానంద్.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ చిత్రంలో శర్వానంద్ సరసన రుక్మిణి వసంత్ కనిపించనుందని సమాచారం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయనున్నారట.
అలాగే రుక్మిణికి బాలీవుడ్ నుంచి సైతం ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడు సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో బిజీగా ఉండనుంది.