AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోతిని వెంటాడుతూ చెట్టు ఎక్కిన పెద్ద పులి.. చివర్లో ట్విస్ట్ మీరు ఊహించలేరు.

పులి అయితే మాత్రం అన్నిసార్లు పాచిక పారదు కదా..? కొన్నిసార్లు బొక్కబోర్లా పడాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే పర్యాటకుల కెమెరాలకు చిక్కింది. ఒక రకంగా చెప్పాలంటే పులి పరువు పోయింది...? అదేంటో తెలియాలంటే కథనంలోకి వెళ్లాల్సిందే .. .. ..

Viral Video: కోతిని వెంటాడుతూ చెట్టు ఎక్కిన పెద్ద పులి.. చివర్లో ట్విస్ట్ మీరు ఊహించలేరు.
Tiger Falls
Ram Naramaneni
|

Updated on: Feb 18, 2026 | 3:48 PM

Share

అడవిలో వేట అంటే అంత ఈజీ కాదండోయ్.. ఎంత పెద్ద క్రూర మృగాలు అయినా.. కొన్నిసార్లు బోల్తా పడిపోతుంటాయ్. వెంటాడి.. వేటాడే జీవులకు ఆ శక్తిని ఇచ్చిన ప్రకృతి.. బలయ్యే జీవులకు సైతం కొన్ని అనుకూలతను ఇచ్చింది. తాజాగా వీడియోనే అందుకు ఉదాహారణ. భారతదేశంలోని కార్బెట్ అటవీ ప్రాంతంలో ఒక అరుదైన వన్యప్రాణి సంఘటన చోటు చేసుకుంది. మంచి ఆకలి మీద ఉన్న పెద్ద పులి.. ఓ లంగూర్ కోతిని వెంటాడింది. దీంతో  ఆ కోతి చావు నుంచి తప్పించుకునేందుకు చెట్టు పైకి ఎక్కింది.  సాధారణంగా తమ బరువు దృష్ట్యా పెద్ద పులులు చెట్లు ఎక్కే ప్రయత్నం చేయవు. కానీ ఈ పులి మాత్రం.. ఆ కోతిని ఎలాగైనా ఆహారంగా చేసుకోవాలని భావించి చెట్టు ఎక్కింది. దీంతో కోతి.. తెలివిగా తమ బరువును మాత్రమే ఆపగలిగే చిటారు కొమ్మల్లోకి వెల్లింది. పులి దాన్ని అనుసరించి.. ఆ కొమ్మలు వద్దకు వెళ్లి పట్టు కోల్పోయి.. కింద పడింది. ఈ దృశ్యాలను పర్యాటకులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది.

వీడియో దిగువన చూడండి… (Video Credit: Catersnews)

Also Read: ఈ ఆకులు నాటు కోళ్లకు వేసి చూడండి.. తర్వాత మీరే ఆశ్చర్యపోతారు… 

Follow Us