Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ధనుష్ సినిమా కోసం రష్మిక అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేశారు ధనుష్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఇక ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తున్నారు ధనుష్. అలాగే తమిళ్ లో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పుడు స్పీడ్ అందుకుందని తెలుస్తోంది.

Rashmika Mandanna: ధనుష్ సినిమా కోసం రష్మిక అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 15, 2023 | 12:23 PM

ధనుష్.. సౌత్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే తెలుగులో డైరెక్ట్ సినిమా చేసి హిట్ అందుకున్నారు ధనుష్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేశారు ధనుష్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ఇక ఇప్పుడు హిందీలో ఓ సినిమా చేస్తున్నారు ధనుష్. అలాగే తమిళ్ లో స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీటితో పాటు టాలీవుడ్ సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పుడు స్పీడ్ అందుకుందని తెలుస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల.

ఈ సినిమా ప్రియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న చేస్తుంది. అయితే ఇందుకోసం ఆమె రెమ్యునరేషన్ తక్కువ తీసుకుంటుందని తెలుస్తోంది. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంది.

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక రెమ్యునరేషన్ 3 కోట్ల వరకు తీసుకుంటుంది. అయితే ధనుష్ సినిమా కోసం ఆమె 2 కోట్లకు తన రెమ్యునరేషన్ తగ్గించిందని తెలుస్తోంది. ధనుష్ సినిమా కావడం పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో రష్మిక 2 కోట్లకు సినిమా చేయడానికి ఓకే చెప్పరాని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది..

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది రష్మిక మందన్న

హీరో ధనుష్ ఇన్ స్టా గ్రామ్  పోస్ట్..

View this post on Instagram

A post shared by Dhanush (@dhanushkraja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.