Andhra Pradesh: ఏపీలో మొదలైన ఎన్నికల హడావుడి.. ఆ మూడు నియోజకవర్గాల అభ్యర్థులపై సజ్జల క్లారిటీ..
సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, ఈస్ట్ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ లే మళ్లీ అభ్యర్థులుగా ఉంటారని సజ్జల ప్రకటించడంతో బెజవాడలో పొలిటికల్ హీట్ పెరుగింది. లోకేష్ పాదయాత్రకు ముందు ముగ్గురు అభ్యర్థులను సజ్జల ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. విజయవాడ అభివృద్ధి వైసీపీతోనే జరిగిందంటూ వ్యాఖ్యానించారు.
అమరావతి, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి స్టార్ట్ అయింది. అధికార పార్టీ మరింత దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తోంది. విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. విజయవాడ పాతబస్తీ పంజాసెంటర్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి.. 2024 ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాస్‌ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులను కూడా గెలిపించాలని పిలుపునిస్తూనే.. ఆ ముగ్గురు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, సజ్జల వ్యాఖ్యలతో ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ముగ్గురి పోటీ ఖరారైపోయింది. రాబోయే రోజుల్లో మిగిలిన టికెట్ల ప్రకటన కూడా ఉండబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది.
చంద్రబాబు పట్టించుకోలేదు..
సిట్టింగ్ ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు, ఈస్ట్ నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్ లే మళ్లీ అభ్యర్థులుగా ఉంటారని సజ్జల ప్రకటించడంతో బెజవాడలో పొలిటికల్ హీట్ పెరుగింది. లోకేష్ పాదయాత్రకు ముందు ముగ్గురు అభ్యర్థులను సజ్జల ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. విజయవాడ అభివృద్ధి వైసీపీతోనే జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అమరావతి పేరుతో చంద్రబాబు విజయవాడను పట్టించుకోలేదని పేర్కొన్నారు. గతంలో కంటే రెండింతలు మెజారిటీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సజ్జల సూచించారు. ఈ నెల 19 నుంచి మూడు నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి టికెట్లపై క్లారిటీ ఇవ్వడం రాజకీయంగా మరింత హీటెక్కిస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..