AP News: వింత కాదు అంతకు మించి.. మూడు కాళ్లతో పుట్టిన మేక, కొబ్బరి చెట్టుకు ఆరు తలలు ఇంకా..
ఆకివీడు మండలం పెదకాపవరం పంచాయతీ పరిధిలోని గంటలరాయుడుపేటలో మరో విచిత్ర ఘటన చర్చనీయాంశంగా మారింది. కఠారి శ్రీనివాస్ కి చెందిన ఆక్వా చెరువుపై ఒక కొబ్బరి చెట్టుకు ఆరు తలలు వచ్చాయి. సాధారణంగా కొబ్బరి చెట్టుకు ఒకటే తల ఉంటుంది. అయితే ఈ కొబ్బరి చెట్టు రెండు పలవులగా విడిపోయి ఆరు తలలు వచ్చాయి. మొక్కను పాతేటప్పుడు మామూలుగానే ఉందని, పెరిగే సమయంలో ఆరు తలలు ఏర్పడ్డాయని..
ఏలూరు, ఆగస్టు 16: సృష్టికి భిన్నంగా ఏది జరిగినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అదో వింతగా భావించే పరిస్థితి కనిపిస్తుంది. మనుషులు, పక్షులు, జంతువులు పుట్టుకతోనే తమ సహజత్వాన్ని కోల్పోతే నిజంగా అది వింతగాను ఆసక్తికరంగాను మారుతుంది. ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మనం చూద్దాం..
నరికేసిన అరటిచెట్టుకు మళ్లీ గెల
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో విచిత్రం చోటుచేసుకుంది. అరిటి గెల పండిన తరువాత నరికివేసిన చెట్టు నుండి మరో గెల వచ్చింది. ఈ ఘటనను అక్కడి స్థానికులు విచిత్రంగా చెప్పుకుంటున్నారు. సాధారణంగా అరటి చెట్టుకు ఒక గెల మాత్రమే కాస్తుంది. అరటి గెల తయారైన తర్వాత అరటి చెట్టును నరికేస్తారు. ఆ విధంగానే రెండు నెలల క్రితం నరికివేసిన అరటి చెట్టు మధ్యలో నుంచి మరో అరటి గెల వచ్చిది. అండలూరు గ్రామానికి చెందిన మేడిచర్ల శ్రీమన్నారాయణ పెరటి తోటలో అరటి చెట్లను పెంచుతున్నాడు. ఒక అరటి చెట్టు వేసిన గల తయారు కావడంతో అరటి గెలను కోసి తరువాత చెట్టును కూడా నరికివేసాడు. నరికేసిన అరటి చెట్టు మధ్యలో నుండి మరో అరటి గెల వచ్చింది. నరికేసిన అరటి చెట్టు నుండి మరో గెల రావడాన్ని స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.
కొబ్బరిచెట్టుకు ఆరు తలలు
ఆకివీడు మండలం పెదకాపవరం పంచాయతీ పరిధిలోని గంటలరాయుడుపేటలో మరో విచిత్ర ఘటన చర్చనీయాంశంగా మారింది. కఠారి శ్రీనివాస్ కి చెందిన ఆక్వా చెరువుపై ఒక కొబ్బరి చెట్టుకు ఆరు తలలు వచ్చాయి. సాధారణంగా కొబ్బరి చెట్టుకు ఒకటే తల ఉంటుంది. అయితే ఈ కొబ్బరి చెట్టు రెండు పలవులగా విడిపోయి ఆరు తలలు వచ్చాయి. మొక్కను పాతేటప్పుడు మామూలుగానే ఉందని, పెరిగే సమయంలో ఆరు తలలు ఏర్పడ్డాయని యజమాని కటారి శ్రీనివాస్ చెప్తున్నారు. ఆరు తలల నుండి కొబ్బరికాయలు కాయడం ఆసక్తిగా చూస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు, స్థానికులు ఈ వింత కొబ్బరిని చుట్టును చూసేందుకు ఆసక్తిగా వస్తున్నారు.
మూడు కాళ్ల మేక
మొక్కలు, చెట్లలోనే కాదు జంతువుల్లో కూడా విచిత్ర సంఘటన వెలుగు చూస్తున్నాయి. మూడు కాళ్లతో పుట్టిన ఒక మేక అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. సహజంగా నాలుగు కాళ్లతో మేకలు పుడతాయి. చాలా అరుదుగా రెండు, లేక మూడు కాళ్లతో అప్పుడప్పుడు మేకలు జన్మిస్తుంటాయి. కానీ ఇవి వెంటనే చనిపోతాయి. జీలుగుమిల్లి మండలం, ఉదయభాస్కర కాలనీలో గొల్లపల్లి రవి కి చెందిన మేక రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒకటి నాలుగు కాళ్లతో పుడితే, మరొకటి మూడు కాళ్లతో పుట్టింది. మూడు కాళ్లతో పుట్టిన మేక పూర్తి ఆరోగ్యంగా ఉంది. మేకలతో కలిసి ఆహారానికి అడవుల్లోనికి వెళుతుంది. మూడు కాళ్ల మేకను గ్రామస్తులు ఆసక్తిగా చూస్తున్నారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇటువంటి ఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.