Andhra Pradesh: రూ.లక్షల్లో జీతం.. కానీ, ఏం సుఖం.. పురుడు పోసి కడుపులో కత్తెర మర్చిపోయారు..
గర్భిణికి పురుడు పోసిన వైద్యులే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. పురుడు పోశారు కానీ.. చివరకు, ఆమె కడుపులో కత్తెరను మరిచిపోయారు. దీంతో ఆ మహిళ కొన్ని నెలలుగా కడుపునొప్పితో నరకయాతన అనుభవిస్తోంది. చివరకు ఎక్స్‌రే తీసిన వైద్యులు కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని
ఏలూరు, ఆగస్టు 16: గర్భిణికి పురుడు పోసిన వైద్యులే నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. పురుడు పోశారు కానీ.. చివరకు, ఆమె కడుపులో కత్తెరను మరిచిపోయారు. దీంతో ఆ మహిళ కొన్ని నెలలుగా కడుపునొప్పితో నరకయాతన అనుభవిస్తోంది. చివరకు ఎక్స్‌రే తీసిన వైద్యులు కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో చోటుచేసుకుంది. గర్భిణి కడుపులో కత్తెర వదిలేసిన ఘటన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, కడుపులో నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన మహిళను పరిశీలించిన వైద్యులు కత్తెర ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఆ ఎక్స్ రేను ఆస్పత్రి సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి. దీంతో వెంటనే ఆ పోస్ట్‌ను ఉన్నతాధికారులు డిలీట్ చేయించారు.
కాగా.. డాక్టర్ల నిర్లక్ష్యంపై ఏలూరు జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. DCHSతో విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రిలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని DCHSని ఆదేశించారు. అయితే, గర్భిణికి ఏప్రిల్ 19న సర్జరీ జరిగింది. ఇంతకాలం బాధితురాలు కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడింది. చివరకు ఆసుపత్రికి వెళితే కత్తెర విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ నిజం బయటకు రాకుండా ప్రభుత్వాసుపత్రి వైద్యులు బాధితురాలిని ట్రీట్మెంట్ కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
కడుపులో కత్తెర ఘటనపై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. బాధ్యులైన వారిని విధుల నుంచి తొలగిస్తామన్నారు. కాగా, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఇంతకుముందు కూడా వైద్యుల నిర్లక్ష్యం ఘటనలు చాలానే బయటకు వచ్చాయి. ఆపరేషన్ చేసి దూది, క్లాత్, బ్లేడ్స్ లాంటివి మర్చిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. తాజాగా.. ఈ విషయం నాలుగు నెలల తర్వాత బయటపడటం చర్చనీయాంశంగా మారింది. కాగా.. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..