Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వంగవీటి ఇంటికి కాబోయే కోడలు ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

టిడిపి ఆవిర్భావం నుండి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతకాలం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇటీవలి కాలంలో మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో చేరి.. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా వంగవీటి రాధా వీరి నివాసానికి వచ్చి..

Andhra Pradesh: వంగవీటి ఇంటికి కాబోయే కోడలు ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Jakkam Pushpavalli
Follow us
B Ravi Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 16, 2023 | 2:12 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వంగవీటి రాధ పెళ్లి కుదరడంతో.. ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మా అన్నకు పెళ్లి అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్‌లోనే వంగవీటి రాధ పెళ్లి కొడుకు కాబోతున్నారు. అయితే, ఇంతకాలం తరువాత రాధ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి ఎవరు? అనే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులందరిలోనూ నెలకొంది. రాధాకృష్ణ సతీమణిగా ఎవరు రాబోతున్నారు.. వంగవీటి ఇంటి కోడలు కాబోతున్న అమ్మాయి ఎవరు? ఆమె ఎలా ఉంటారు? అని తెగ ఆరా తీస్తున్నారు అభిమానులు. మరి రాధా తాళి కట్టబోయే ఆ యువతి ఎవరో తెలుసుకుందాం..

నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి అమ్మాని దంపతుల చిన్న కుమార్తెనే వంగవీటి రాధా పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.. బాజ్జి దంపతలుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ద్వితీయ పుత్రిక పుష్పవల్లిని రాధాకు ఇచ్చి పెళ్లి చేయనున్నారు. జక్కం అమ్మాని 1987-92 వరకు నరసాపురం మున్సిపాలిటీ టిడిపి చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పుష్పవల్లి స్కూల్, కాలేజ్ విద్యాభ్యాసం అంతా నరసపురంలోనే జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంత కాలం హైదరాబాద్‌లో యోగా టీచరుగా చేసిన పుష్పవల్లి.. ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టారు.

తండ్రి టిడిపి ఆవిర్భావం నుండి నరసాపురం రాజకీయాలలో కీలక పాత్ర పోషించేవారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతకాలం హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇటీవలి కాలంలో మళ్ళీ నరసాపురంలో నూతన గృహ నిర్మాణం చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇటీవల ఈయన జనసేన పార్టీలో చేరి.. క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా నరసాపురం వచ్చినప్పుడు వీరి ఇంట్లోనే బస చేశారు. ఇటీవల వంగవీటి రంగ జయంతి సందర్భంగా వంగవీటి రాధా వీరి నివాసానికి వచ్చి.. రంగా జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగానే రాధా మిత్రులు వివాహ సంబంధం గురించి ఇరువైపులా పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వివాహానికి ముహూర్తం ఖరారైంది. . అనివార్య కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్ డేట్స్ సర్దుబాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నా… నర్సాపురం అమ్మాయి… బెజవాడ అబ్బాయికి త్వరలోనే ఘనంగా పెళ్లి చేసేందుకు ఇరు పక్షాల పెద్దలు సమాయత్తమవుతున్నారు. నర్సాపురానికి చెందిన జనసేన ఇన్‌ఛార్జ్ నాయకర్, మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం రాధా నర్సాపురం పర్యటనలో పాల్గొని కుటుంబ సభ్యులతో జరిగిన చర్చల సందర్భంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..