Andhra Pradesh: అష్టాచమ్మ ఆటలో ఘర్షణ.. స్నేహితుడి ప్రాణం తీసేశాడు.. ఎక్కడ జరిగిందంటే..
నలుగురు స్నేహితుల మధ్య అష్టా చమ్మా సందర్భంగా మొదలైన వివాదం ఒకరి ఊపిరితీసింది. వివాదం మొదలవాడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరు మరొకరు అని పిడుగులు గుద్ధి తోసేసారు. వెనక్కి పడిపోయిన ఆ వ్యక్తి తల సిమెంట్ గట్టుకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం కాలనీ గవరివిదికి చెందిన పెయింటర్ నారాయణ రావు.. మద్దిలపాలేనికి చెందిన రాంబాబు, రమణ దాసు అనే నలుగురు స్నేహితులు.
విశాఖలో నలుగురు స్నేహితుల మధ్య అష్టా చమ్మా సందర్భంగా మొదలైన వివాదం ఒకరి ఊపిరితీసింది. వివాదం మొదలవాడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరు మరొకరు అని పిడుగులు గుద్ధి తోసేసారు. వెనక్కి పడిపోయిన ఆ వ్యక్తి తల సిమెంట్ గట్టుకు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం కాలనీ గవరివిదికి చెందిన పెయింటర్ నారాయణ రావు.. మద్దిలపాలేనికి చెందిన రాంబాబు, రమణ దాసు అనే నలుగురు స్నేహితులు. నలుగురు పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నలుగురు కలిసి మద్దిలపాలెం బజార్ సమీపంలోని సులాబ్ కాంప్లెక్స్ వద్దకు చేరారు. అక్కడ అష్టాచమ్మా ఆట మొదలెట్టారు. అక్కడ ఉన్న వ్యక్తి వారించినా.. వినకుండా ఆట ప్రారంభించారు.
అక్కడే వివాదం మొదలైంది..
కాసేపటి తర్వాత ఆ నలుగురులో నారాయణరావు రాంబాబు మధ్య వివాదం మొదలైంది. దీంతో నారాయణరావు అక్కడ ఉన్న అష్టాచమ్మా పిక్కలను తోసేసాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రాంబాబు.. నారాయణ రావు పై దాడి చేశాడు. అంతేకాకుండా బలంగా వెనక్కి తోసేయడంతో కింద పడిపోయాడు నారాయణరావు. ఈ క్రమంలో అక్కడే ఉన్న సిమెంట్ గట్టుకు తల తగిలింది. కుప్పకూలి ప్రాణాలకు కోల్పోయాడు నారాయణరావు. రంగంలోకి దిగిన ఎంవిపి పోలీసులు.. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వద్దన్నా.. అతనిపై తిరగబడ్డారు..
అయితే, ఈ నలుగురు మద్యం మత్తులో ఉన్నారు. పిఠాపురం కాలనీ బజారు వద్ద సులాబ్ కాంప్లెక్స్ వద్దకు చేరారు. అక్కడ ఆట మొదలెట్టారు. అక్కడున్న కేర్ టెకర్ రామకృష్ణ.. వద్దని వారించి వెళ్ళిపొమ్మన్నాడు. అక్కడ నుంచి వెళ్లి.. కాసేటికి మళ్ళీ తిరిగి వచ్చారు. మళ్ళీ వారిస్తే.. రామకృష్ణ పై తిరగబడ్డారు. ఒక్కానొక సమయంలో ఆ నలుగురు.. రామకృష్ణ పై దాడికి యత్నింంచ్చారు.
అంతకు ముందే వివాదమా..?
అష్టా చమ్మా ఆట మొదలుపెట్టిన సమయంలో.. అక్కడే ఉన్న సులభ కాంప్లెక్స్ కేర్ టెకర్ రామకృష్ణ వాళ్లను ప్రశ్నించారు. వద్దన్నా వినకుండా ఆట మొదలుపెట్టి ఘర్షణకు దిగారు. అయితే.. అక్కడకు రాకముందే వాళ్ళ మధ్య ఎదో వివాదం నడిచిందని అంటున్నాడు ప్రత్యక్ష సాక్షి రామకృష్ణ. వాళ్ళు అప్పటికే ఎదో విషయం చర్చించుకుని.. మాటామాటా పెంచుకున్నారని, ఈ క్రమంలో వివాదం పెద్దదై.. అష్టచెమ్మ పిక్కలను నారాయణారావు తీసేయాడంతో రాంబాబు కోపంతో దాడి చేసాడని చెప్పుకొచ్చాడు రామకృష్ణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..