Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi Knee Surgery: మెగాస్టార్‌ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ఢిల్లీలో రెస్ట్‌!

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరగనున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు లేదా న్యూఢిల్లీలో ఆపరేషన్ జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. చిరు పీఆర్ టీమ్ ఇచ్చిన సమాచారం మేరకు వాళ్లంతా ఊపిరిపీల్చుకుంటారు. చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..

Megastar Chiranjeevi Knee Surgery: మెగాస్టార్‌ చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ఢిల్లీలో రెస్ట్‌!
Megastar Chiranjeevi
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2023 | 10:46 AM

మెగాస్టార్ చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. న్యూఢిల్లీలో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో రెండు రోజుల ఆయన తన మోకాలికి ఆపరేషన్ జరిగింది. వారం పాటు న్యూఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తారని ఆయన పీఆర్‌ బృందం వెల్లడించింది. తరచూ మోకాలిలో నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకున్న చిరు..‘నీ వాష్’ (knee wash surgery) సర్జరీ చేసినట్టు సమాచారం. ఎలాంటి కోత లేకుండానే ఆర్థ్రోస్కోపిక్‌ విధానంలో ఇన్ఫెక్షన్‌ తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో నాలుగైదు రోజుల్లో హైదరాబాద్‌కు తిరిగి రానున్నట్లు ఆయన పీఆర్‌ బృందం తెలిపింది.

కాగా చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స జరగనున్నట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. బెంగళూరు లేదా న్యూఢిల్లీలో ఆపరేషన్ జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆందోళన చెందారు. చిరు పీఆర్ టీమ్ ఇచ్చిన సమాచారం మేరకు వాళ్లంతా ఊపిరిపీల్చుకుంటారు. చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని మెగా ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక సినిమా విషయానికొస్తే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్’ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా చతికిలపడింది. ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ‘భోళా శంకర్’లో దర్శకుడు మెహర్ రమేష్ ఎలాంటి కొత్తదనం చూపించకపోవడమే డిజాస్టర్‌కు ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా చిరంజీవి లాంటి సీనియర్ యాక్టర్‌తో వెకిలి కామెడీ చేయించడం అభిమానులు సుతారం నచ్చలేదు.

మరోవైపు తెలుగులో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై వచ్చిన ఈ మువీ హిందీలో ఆర్కేడీ స్టూడియోస్‌ విడుదల చేయనుంది. ఆగస్టు 25న ఈ సినిమా బీటౌన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా హిందీ వెర్షన్‌ టీజర్‌ను కూడా చిత్ర బృందం విడుదల చేశారు. అన్నాచెల్లెలు అనుబంధంతో ముడిపడిన ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ మువీలో తమన్నా, కీర్తి సురేష్‌, సుశాంత్‌, తరుణ్‌ అరోడా, మురళీ శర్మ, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు