AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు' స్టార్ హీరోయిన్ ఆవేదన

‘నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

Phani CH
|

Updated on: Feb 18, 2026 | 10:05 AM

Share

మాజీ హీరోయిన్ రేఖా వేదవ్యాస్ తన జీవితంలోని చేదు నిజాలను ధైర్యంగా పంచుకుంది. వరుస పరాజయాలతో సినిమాలకు దూరమైన ఆమె, అనారోగ్య సమస్యలతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయానని తెలిపింది. పెళ్లిపై మొదట ఆసక్తి లేకపోయినా, ఇప్పుడు మంచి సంబంధం కోరుకుంటున్నా తన పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రావడం లేదని భావోద్వేగమైంది. కష్టాలు దాటుకుని నిలబడటం దైవదయ అని పేర్కొంది.

సినిమా సెలబ్రిటీల జీవితమంటే రంగుల పాన్పు కాదు. వారికి కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందుల ఉంటాయి. కొందరు చెప్పుకోరు. కానీ.. మరికొందరు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి తమ కష్టాలను పంచుకుంటుంటారు. అలా గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన రేఖా వేదవ్యాస్‌.. తన జీవితంలోని చేదు నిజాలను అందరితో షేర్ చేసుకుంది. గతంలో పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రేఖ. అయితే వరుసగా పరాజయాలు పలకరించడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అప్పుడప్పుడు టీవీ షోల్లో మాత్రమే కనిపిస్తూ తన గోడను వెళ్లబోసుకుంటోంది. 2001 ఆనందం సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది రేఖా వేద వ్యాస్. అందులో తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని తర్వాత పలు హిట్ సినిమాల్లో యాక్ట్ చేసి ఆడియెన్స్ కు బాగానే చేరువైంది. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది.2012 తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు రేఖ. అయితే ఆ మధ్యన కొన్ని టీవీ షోలతో పాటు ఇంటర్వ్యూలకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యింది. గత కొన్నేళ్లుగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ ఎమోషనలైంది. అంతేకాదు శారీరకంగా, మానసికంగా కూడా చాలా కుంగిపోయానంటూ రేఖ చెప్పుకొచ్చింది. హెల్త్ కండీషన్స్ సరిగా లేకపోవడంతోనే సినిమాలకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తనకు పెళ్లిపై ఆసక్తి ఉండేది కాదని.. ఆ తర్వాత మనసు మారి పెళ్లి చేసుకుందామంటే తన పరిస్థితిని చూసి ఎవరూ ముందుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చింది. ఏదో తొందరపడి పెళ్లి చేసుకుని విడాకుల దాకా వెళ్లే బంధాలకంటే, ఆలస్యమైనా మంచి సంబంధం కావాలన్నది తన అభిప్రాయం అంటూ రేఖ చెప్పుకొచ్చింది.ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయిందని… ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డానంటే అది దేవుడి దయనే అంటూ చెప్పుకొచ్చిందీ అందాల తార. ప్రస్తుతం ఈ హీరోయిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajinikanth: మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!

Nagarjuna: ‘ధురంధర్’లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్

Follow Us