Rajinikanth: మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్ గురూ..!
రజనీకాంత్, కమల్ హాసన్ దాదాపు 35 ఏళ్ల తర్వాత ఓ మల్టీస్టారర్ సినిమాతో తిరిగి స్క్రీన్ పంచుకోనున్నారు. కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజినీకాంత్‌కు ₹225 కోట్ల భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఇద్దరికీ సమాన ప్రాధాన్యతతో కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మెగా రీయునియన్ అభిమానులకు పెద్ద పండగే.
రజనీకాంత్ – కమల్ హాసన్! భారతీయ సినిమా చరిత్రలోనే తమ కంటూ గొప్ప స్థానం సంపాదించుకున్న వారు.! ఈ ఇద్దరూ దాదాపు ఐదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమను ఏలుతున్నారు. తమ యాక్టింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఎన్నో సినిమాల్లోనూ నటించారు. దాదాపు 20కు పైగా సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ సుమారు 35 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేస్తున్నారు రజనీ, కమల్. ఈ మల్టీ స్టారర్ సినిమాను స్వయంగా కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ క్రమంలోన ఈ మూవీని నెల్సన్ డైరెక్ట్ చేయబోతున్నారని లేటెస్ట్‌గా ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇందుకో సం రజినీ భారీగానే డబ్బులు తీసుకుంటున్నట్టుగా కూడా మరో టాక్ కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాతనే ఆయన కమల్- రజనీల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరికీ సమాన ప్రాధాన్యం ఉండేలా నెల్సన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్ తీసుకుంటోన్న పారితోషికంపై ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ 225 కోట్ల రూపాయల భారీ పారితోషికం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్నేహితుడు, నిర్మాత కమల్ హాసన్ కూడా రజనీకి ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nagarjuna: ‘ధురంధర్’లో విలర్ ఛాన్స్ మిస్ !! నాగార్జున రియాక్షన్
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్‌లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

