ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
జంగారెడ్డిగూడెంలో మామయ్య ఫంక్షన్‌కు వచ్చిన ఆరో తరగతి బాలుడు సుశాంత్ గ్రైండర్ షాక్‌తో విషాదాంతం అయ్యాడు. తెగిపోయిన వైరును పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటన ఫంక్షన్లలో విద్యుత్ పరికరాల నిర్లక్ష్యం, పాత వైర్ల వాడకం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. పిల్లలు తిరిగే ప్రదేశాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాల మీదకు తెస్తుందని ఈ దుర్ఘటన హెచ్చరిస్తుంది.
మామయ్య ఇంట్లో ఫంక్షన్ కోసం వచ్చిన బాలుడు సందడిగా తిరుగుతున్నాడు. తెల్లవారితే ఇంట్లో ఫంక్షన్.. కుటుంబ సభ్యులంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక పిల్లలకు ఫంక్షన్స్ అంటే ఎంత సరదానో చెప్పనక్కర్లేదు. రకరకాల వంటలు, పదిమందిలో కలసి బంతిభోజనం చెయ్యడమంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. పెద్ద పెద్ద పాత్రలతో వంటలు చేస్తుంటే వింతగా చూస్తారు. అలా తెల్లవారి ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ బాలుడు వంటలు చేసే ప్రదేశానికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ గ్రైండర్ అతనిపాలిట మృత్యుపాశంగామారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన చంద్రరావు, లలిత దంపతుల చిన్న కుమారుడు సుశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. తన మామయ్య మధు ఇంట్లో జరగనున్న వేడుక కోసం అక్కడికి వెళ్లాడు. వేడుకకు సంబంధించి వంటల పనులు హడావుడిగా సాగుతున్నాయి. వంటశాల వద్ద మసాలాలు నూరడానికి సిద్ధం చేసిన గ్రైండర్ వద్దకు సుశాంత్ వెళ్లాడు. దురదృష్టవశాత్తూ ఆ గ్రైండర్ వైర్ ఒక చోట తెగి ఉండటంతో, అది గమనించని సుశాంత్ ఆ వైర్‌ను పట్టుకున్నాడు. క్షణాల్లో భారీ స్థాయిలో విద్యుత్ ప్రవహించడంతో బాలుడు కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తెల్లవారితే ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉండగా, సుశాంత్ మరణవార్త విన్న బంధువుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకూ సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారి అచేతనంగా మారిపోవడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన వెనుక వంట పనివారి అజాగ్రత్త, ఎలక్ట్రికల్ వస్తువులను సరఫరా చేసేవారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పాత వైర్లకు ప్లాస్టర్లు వేసి వాడుతుంటారు, ఇవి పనులు చేసేటప్పుడు విడిపోయి ప్రాణాంతకంగా మారుతుంటాయి. ఫంక్షన్లలో వాడే గ్రైండర్లు, లైటింగ్ వైర్లు, కూలర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు తిరిగే చోట విద్యుత్ వైర్లు తెగి ఉండకుండా చూసుకోవాలి. లేదంటే ఒక చిన్న ఏమరపాటు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Banana: బనానా షేక్ మంచిదా.. అరటి పండ్లు బెస్టా.. నిపుణులేమంటున్నారు ??
బాహుబలికి, భన్సాలీ సినిమాకీ లింకేంటి ??
Mahesh Babu: కావాలంటే నా పాస్ పోర్టు చూపిస్తానంటున్న మహేష్… అసలేం జరిగింది
Raashii Khanna: రియల్ లైఫ్ లో పెద్ది డైలాగ్ ను ప్రాక్టీస్ చేస్తున్న రాశీ
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి
లాకర్లో బంగారం మాయం.. బ్యాంక్ మేనేజర్ చేతివాటం
గోత్రం చూసి ఏడు తరాల సమాచారాన్ని.. చెప్పేస్తారు.. ఎక్కడంటే..
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది

