అర్జున్ సర్జా దర్శకత్వంలో వచ్చిన సీత పయనం తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ఎంట్రీ కోసం రూపొందించిన భావోద్వేగ ప్రధాన చిత్రం. కమర్షియల్ హంగుల కంటే హిందూ ధర్మ రక్షణ, గో సంరక్షణ, దేశభక్తి వంటి భారతీయ సంప్రదాయ విలువలకు పెద్దపీట వేసింది. కొన్ని ఉపన్యాసాలున్నా, కుటుంబ అనుబంధాలను బలంగా చూపించిన ఈ సినిమా మంచి అనుభూతినిస్తుంది.