రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది.. టాలీవుడ్ హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

17 February 2026

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలలో మమతా మోహన్ దాస్ ఒకరు. తక్కువ సమయంలోనే సౌత్ లో క్లిక్ అయ్యింది ఈ బ్యూటీ.

తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, రుద్రంగి వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళం, మలయాళం భాషలలో అనేక మూవీస్ చేసింది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే రెండుసార్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనకు మళ్లీ ప్రేమపై దృష్టి మళ్లిందని అన్నారు మమతా.

తాను మలయాళఈ సినిమాకు చెందిన ఓ నటుడితో డేటింగ్ కు వెళ్లాలని.. కానీ అతడికి అప్పటికే మరో యువతితో నిశ్చితార్థం జరిగిందని తెలిపింది.

ఆ అమ్మాయి నమ్మకాన్ని బద్దలు కొట్టడానికి వారికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన చెందానని అన్నారు. దీని గురించి అతడు లైట్ తీసుకున్నారని అన్నారు. 

కాగా తనకు వివాహ బంధంపై నమ్మకం ఉందని.. అది ఎప్పటికీ చెరగని అన్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు

2011 డిసెంబరు 28న బహ్రెయిన్ కు చెందిన వ్యాపారవేత్త ప్రజిత్ పద్మనాభన్‌తో మమతా వివాహం జరగ్గా..2012లో విడాకులు తీసుకున్నారు.