ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 134 చిత్రాలకు సంబంధించిన పాటల హక్కులు సరిగమ మ్యూజిక్ లేబుల్కే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. వారి అనుమతి లేకుండా ఆ పాటలను ఉపయోగించవద్దని ఇళయరాజాకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, ఇది సరిగమకు అనుకూలంగా మారిన తీర్పు.