AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haleem Benefits: రంజాన్ స్పెషల్.. హలీం హెల్త్ సీక్రెట్ తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. మరీ ఇన్ని లాభాలా..

Haleem Health Benefits: పవిత్ర రంజాన్ మాసం సీజన్ ప్రారంభమైంది..దీంతో హైదరాబాద్‌ నగరం సహా పలు ప్రాంతాల్లో హలీం సందడి మొదలైంది. మంచి పోషకాలు కలిగిన ఈ ప్రత్యేకమైన హలీం వంటకం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యాన్ని పొందింది. హలీం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు..

Haleem Benefits: రంజాన్ స్పెషల్.. హలీం హెల్త్ సీక్రెట్ తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.. మరీ ఇన్ని లాభాలా..
Health Benefits Of Haleem
Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2026 | 10:47 AM

Share

రంజాన్ సీజన్ మొదలైంది.. హైదరాబాద్‌ నగరం సహా పలు ప్రాంతాల్లో హలీం సందడి మొదలైంది. చికెన్ లేదా మటన్, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌తో సాంప్రదాయ భట్టీలపై నెమ్మదిగా గంటలపాటు తయారు చేసే ప్రత్యేకమైన హలీం వంటకాన్ని.. రంజాన్ మాసంలో నాన్ వెజ్ ప్రియులు తప్పనిసరిగా రుచి చూస్తారు. హలీంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. రంజాన్ సందర్భంగా అత్యంత ప్రాచుర్యం పొందిన హలీం గురించి, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదలరు.. రంజాన్ ఉపవాసం తర్వాత ఇఫ్తార్ విందులలో ప్రత్యేకంగా వడ్డించే ఈ హలీం.. అందరూ తినే బలవర్థకమైన ఆహారం. మాంసంతో (గొర్రె, మేక, కోడి) పాటు, శాఖాహారుల కోసం వెజిటేరియన్ హలీం కూడా అందుబాటులో ఉంటుంది.

పోషకాల పవర్‌హౌస్.. హలీంలో ఎన్నో పోషకాలు..

హైదరాబాద్ హలీం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.. హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరుందో, దీనికి కూడా అంతే ఖ్యాతి ఉంది. మాంసం (మటన్ లేదా చికెన్) తోపాటు.. గోధుమలు, పప్పులు, నెయ్యి, అల్లం, వెల్లుల్లి, పసుపు, పిస్తా, బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ హలీం తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని గంటల ప్రాసెస్ తర్వాత.. హలీంను రెడీ చేస్తారు. ఇది నిమ్మరసంతో కలిపి తింటారు.

హలీంలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు (A, C, E, K) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది.. ఎముకల బలాన్ని పెంచి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

హలీం తినడం వల్ల కలిగే పది ఆరోగ్య ప్రయోజనాలు

బలవర్ధకమైన పోషకాహారం: హలీం అత్యంత బలవర్ధకమైనది, పోషకాలతో నిండిన ఆహారం.

రక్తపోటు స్థిరీకరణ: రక్తపోటు (బీపీ) ఉన్నవారికి ఇది బీపీని స్థిరీకరించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: హలీం రోగనిరోధక శక్తిని పెంచి, ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి వాటిని నిరోధించి, అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, నిమోనియా వంటి అంటువ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. కోవిడ్, మంకీపాక్స్, జికా, నిఫా, చికెన్‌పాక్స్, డెంగ్యూ, చికెన్‌గునియా వంటి వైరస్‌ల ప్రభావం తగ్గించడంలో కూడా ఇది తోడ్పడుతుంది.

గాఢ నిద్ర: హలీం తినడం వల్ల రాత్రిపూట మంచి గాఢ నిద్ర పడుతుంది.

జీర్ణశక్తి మెరుగుపడుతుంది: జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియను క్రమబద్ధీకరించి, అజీర్తిని నివారిస్తుంది.

బరువు నియంత్రణ: హలీంలో నెయ్యి, మాంసం ఉన్నప్పటికీ, దీనిని తినడం వల్ల బరువు పెరగరు.. బరువు తగ్గడానికి కూడా తోడ్పడవచ్చు.

శారీరక దారుఢ్యం: క్రీడాకారులు, బౌన్సర్లు, పోలీసులు, మిలటరీ దళాలు, సెక్యూరిటీ గార్డులు వంటి వారికి కండపుష్టిని, దేహదారుఢ్యాన్ని అందిస్తుంది.

ఎముకల పటుత్వం పెరుగుతుంది: పిల్లలలో ఎముక ఎదుగుదలకు సహాయపడి, ఎత్తు పెరిగేలా చేస్తుంది. వృద్ధాప్యంలో కాల్షియం, విటమిన్ డి లోపం వల్ల వచ్చే ఎముక పెళుసుదనాన్ని నివారించి, ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, పిక్కల నొప్పులను తగ్గిస్తుంది.

చర్మ సౌందర్యం: చర్మాన్ని కాంతివంతంగా, నిగనిగలాడేలా చేసి, మొటిమలు, మచ్చలు, పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. వేసవిలో వచ్చే చెమట పొక్కులను కూడా నివారిస్తుంది.

లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది: హలీం స్టామినాను సమర్థవంతంగా పెంచి, లైంగిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఈ విధంగా హలీం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఒక సంపూర్ణ ఆహారం. రంజాన్ నెలలో మాత్రమే కాకుండా, ఇప్పుడు సంవత్సరం పొడవునా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇంట్లో కూడా సునాయాసంగా దీనిని తయారుచేసుకోవచ్చు.

గమనిక: ఈ వార్తా కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us