TS TET-2023: తెలంగాణ అభ్యర్ధులకు అలర్ట్.. టెట్ దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు!
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 రాసేందుకు దరఖాస్తు గడువు బుధవారం (ఆగస్టు 16)తో ముగియనుంది. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు కూడా ఈ రేజే ఆఖరు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ విడుదలవ్వగా ఆగస్టు 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. మంగళవారం (ఆగస్టు 15) నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య భారీగా తగ్గే..
హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 రాసేందుకు దరఖాస్తు గడువు బుధవారం (ఆగస్టు 16)తో ముగియనుంది. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు కూడా ఈ రేజే ఆఖరు. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని వారు ఈ రోజు రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాగా ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ విడుదలవ్వగా ఆగస్టు 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. మంగళవారం (ఆగస్టు 15) నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. మరో వైపు హైదరాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం.. ఈ ఆరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాల సామర్థ్యం నిండిపోవడంతో వీటిని ఈ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను బ్లాక్ చేశారు. ఇక కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆ జిల్లాల్లో పరీక్ష రాసేందుకు వీలుండదు. దీంతో పరిపడా పరీక్షా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేయలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబరు 15న తెలంగాణ టెట్-2023 పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఒకటే రోజున ఆన్‌లైన్ విధానంలో రెండు షిఫ్టుల్లో టెట్ పరీక్ష జరనుంది. పేపర్ 1 పరీక్ష మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 2 పరీక్ష రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. హాల్ టికెట్లు పరీక్షకు వారం రోజులు ముందుగా అంటే సెప్టెంబర్ 9 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత టెట్ ఫలితాలు సెప్టెంబర్ 27వ తేదీన ప్రకటించనున్నారు.
కాగా ఉపాధ్యాయ నియామక పరీక్షలో టెట్ వెయిటేజీ ఉంటుంది. అందుకు పేపర్-1, పేపర్-2లో అభ్యర్ధులు తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు టెట్ 2023 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత నాలుగోసారి టెట్ పరీక్ష నిర్వహిస్తుండటం విశేషం. ఈ సారి టెట్ తర్వాత టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) జరపాలని సర్కార్ యోచిస్తోంది. గతేడాది మాదిరిగానే దాటవేస్తారో.. లేదా నిజంగానే ఈసారి టీచర్ జాబ్ నోటిఫికేషన్ ఇస్తారో వేచిచూడాల్సిందే.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.