Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో ముగిసిన సిక్ హాలిడేస్.. ఇంకా క్యాంపస్ చేరని విద్యార్థులు..
స్టూడెంట్స్‌లో ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది ట్రిపుల్ ఐటీ. విద్యార్థులకు భరోసా కల్పించేందుకు అన్ని విధాలు చర్యలకు సిద్ధమైంది ట్రిపుల్ ఐటీ. ఒక్కో లెక్చరర్ 100 నుంచి 150 మంది స్టూడెంట్స్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్ల సంఖ్య పెంచాలని, గర్ల్ స్టూడెంట్స్ కోసం మహిళా కేర్ టేకర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి రోజూ ఉదయం యోగా, 15 రోజులకోసారి మోటివేషన్ క్లాస్, వారానికొకసారి ‘ఆర్యూ ఒకే’ ప్రోగ్రామ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక ప్రతి శనివారం రాత్రి మోటివేషనల్ మూవీ వేయాలని, స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచాలని డిసైడ్ అయ్యారు.

బాసర ట్రిపుల్ ఐటీలో జాదవ్ బబ్లూ అనే పీయూసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. క్యాంపస్‌లో వరుస ఆత్మహత్యలు జరుగుతుండడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో హుటాహుటిన బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్‌కు ఐదు రోజుల పాటు హోమ్సిక్హాలీడేస్ ప్రకటించారు. క్లాసులు మొదలై వారమైనా కాకముందే సెలవులు ఇచ్చారు. విద్యార్థులను తీసుకువెళ్లడానికి వచ్చిన పేరెంట్స్‌తో వీసీ మీటింగ్ నిర్వహించారు. క్యాంపస్‌లో చదివేందుకు పిల్లల్ని మానసికంగా సిద్ధం చేసి పంపాలంటూ వీసీ సూచనలు ట్రిపుల్ ఐటీపై భరోసా ఉంటేనే తిరిగి పంపాలంటూ వీసీ చెప్పారు. అయితే నిన్నటితో సిక్ హాలిడేస్ ముగిశాయి. కానీ ఇంకా క్యాంపస్ విద్యార్థులు రాలేదు. 1,492 మంది విద్యార్థులకు గానూ.. కేవలం 56 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. స్టూడెంట్స్ ఇంకా రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, నిన్న సెలవు కావడంతో స్టూడెంట్స్ ఇంకా ఇంటి వద్దే ఉన్నారని, ఇవాళ అందరూ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు స్టూడెంట్స్‌లో ఒత్తిడి తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది ట్రిపుల్ ఐటీ. విద్యార్థులకు భరోసా కల్పించేందుకు అన్ని విధాలు చర్యలకు సిద్ధమైంది ట్రిపుల్ ఐటీ. ఒక్కో లెక్చరర్ 100 నుంచి 150 మంది స్టూడెంట్స్‌కు మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. కౌన్సిలర్ల సంఖ్య పెంచాలని, గర్ల్ స్టూడెంట్స్ కోసం మహిళా కేర్ టేకర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి రోజూ ఉదయం యోగా, 15 రోజులకోసారి మోటివేషన్ క్లాస్, వారానికొకసారి ‘ఆర్యూ ఒకే’ ప్రోగ్రామ్ నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక ప్రతి శనివారం రాత్రి మోటివేషనల్ మూవీ వేయాలని, స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచాలని డిసైడ్ అయ్యారు. స్టూడెంట్స్ సమస్యలు, ప్రోగ్రెస్ పై ప్రతినెలా పేరెంట్స్‌తో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించించేందుకు లెక్చరర్లతో కమిటీని ఏర్పాటు చేయాలని, మెస్‌లో ఫుడ్ క్వాలిటీని లెక్చరర్లు చెక్ చేయాలని సూచించారు. అయితే సెలవులు ముగిసినా ఇంకా విద్యార్థులు క్యాంపస్‌కు చేరుకోకపోవడంతో చర్చనీయాంశమైంది.
ఇదిలాఉంటే.. ప్రభుత్వం సైతం బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యపై దృష్టి సారించింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతం ట్రిపుల్ ఐటీలో పర్యటించి, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అయితే, మంత్రి పర్యటించినా.. క్యాంపస్‌లో విద్యార్థుల మరణాలు మాత్రం ఆగడం లేదు. అందుకే.. ముందుగా విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని పెంపొందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు చర్యలు చేపట్టారు. మరి వీరి ప్రయత్నాలు ఫలించేనా? విద్యార్థులు వచ్చేనా? పరిస్థితిలో మార్పులు వచ్చేనా? చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
